Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ నుంచి పోటీ చేయండి.. సోనియా గాంధీనీ కోరిన సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 6

వచ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ( Sonia Gandhi ) కి సీఎం రేవంత్ ( cm revanth reddy ) రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ ( telangana ) నుంచి పోటీ చేయాల‌ని కోరుతూ ఇప్ప‌టికే పీసీసీ ( pcc ) తీర్మానించిన విష‌యాన్ని రేవంత్ సోనియా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన త‌ల్లిగా రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు.

Read also: మేడారం జాతరకు రూ.100 కోట్లు.. వన దేవతలకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మొక్కులు..

స్పందించిన సోనియా స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. న్యూఢిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం టెన్ జ‌న్‌ప‌థ్‌లో ఆమెను సీఎం రేవంత్ రెడ్డి సోమ‌వారం సాయంత్రం క‌లిశారు. ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న హామీల‌ను సీఎం రేవంత్ సోనియాకి వివరించారు.

Hospital

Read also: 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ .. లఖ్ నవూ జిల్లా కారాగారంలో కలకలం..

ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.10 ల‌క్ష‌లకు పెంచినట్లు తెలిపారు. బ‌స్సుల్లో ఇప్ప‌టికే 14 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేశార‌ని ఆయ‌న చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్ అంద‌జేత‌, 200 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్ ఉచిత స‌ర‌ఫ‌రా అమ‌లుకు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సోనియా గాంధీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. బీసీ కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని, ఇందుకు సంబంధించి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని సోనియాకి సీఎం రేవంత్ తెలిపారు.

Read also: చెప్పుతో కొడతా..! సీఎం రేవంత్ పై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు..

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అత్య‌ధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే అన్ని ర‌కాలుగా స‌న్నాహాలు పూర్తి చేసిన‌ట్లు సోనియాగాంధీకి ముఖ్య‌మంత్రి రేవంత్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆశావాహుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించామ‌ని, వాటిపై పూర్తిస్థాయిలో క‌స‌ర‌త్తు చేసి బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.