Read News in Telugu Language
adsdaksha

భార‌త్ న్యాయ్ యాత్ర‌లో సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ ను కలిసిన మంత్రులు భట్టి, పొంగులేటి..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 6

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భార‌త్ న్యాయ్ యాత్ర‌లో సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) పాల్గొన్నారు. జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో కొన‌సాగుతున్న న్యాయ్ యాత్ర‌లో రాహుల్ ( Rahul ) ని రేవంత్ రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ( congress ) ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రెండు గ్యారంటీలు మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిమితిని రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచి అమ‌లు చేస్తున్న తీరును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివ‌రించారు.

Hospital

Read also: నేడే ఆఖరు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు చివరి గడువు..

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న తీరును రాహుల్ గాంధీకి ముఖ్య‌మంత్రి వివ‌రించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి రాహుల్ ను కలిశారు.

Leave A Reply

Your email address will not be published.