Read News in Telugu Language
adsdaksha

కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 9

కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ( brs ) నాయకుల పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు సరిపోతాయని సంతకం పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఇదే విషయాన్ని నామా నాగేశ్వర రావు చెప్పారని గుర్తు చేశారు. నిజంగా ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ముఖ్యమంత్రి ఆరోపించారు.

read also : పీవీకి భారతరత్న.. చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు అత్యున్నత పౌర పురస్కారం ..

Hospital

కాళేశ్వరం అవినీతి బయటపడటంతో కేఆర్ఎంబీ ( krmb) కి అప్పగించారంటూ తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఏపీ మంత్రి రోజా ( ap minister roja ) ఇంట్లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు రాయల సీమ ( rayalaseema ) జిల్లాలకు నీళ్ళు ఎట్లా పోతున్నాయో వారే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ సహకారంతోనే ఏపీ సీఎం జగన్ ( ap cm jagan ) తుపాకులతో వచ్చి నాగార్జున సాగర్ ( nagarjuna sagar ) ను ఆక్రమించుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ సహకారంతో నాగర్జున సాగర్ పైకి ఏకే 47గన్స్ తో వచ్చారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి శ్రీశైలం ( srisailam ) నుంచి రోజుకు 12 టీఎంసీ నీళ్లు తోడుకపోవాలని చూస్తుంటే కేసీఆర్ ( kcr ) పట్టించుకోలేదని విమర్శించారు. ఇలా జరిగితే శ్రీశైలంలో బురద కూడా ఉండదని అన్నారు.

read also : ఉద్రిక్తతంగా ఉత్తరాఖండ్ .. మసీదు, మదర్సా కూల్చివేతతో రణరంగం ..

నిండు కుండలా ఉన్న నీళ్లకు జగన్ మోహన్ రెడ్డి బొక్క పెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ మంత్రి రోజా పెట్టిన రాగి సంకటి తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొట్టాడి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నల్లగొండ జిల్లాకు తెస్తే ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2014 వరకు 30 కిలోమీటర్ల మేర తొవ్విన టన్నల్ ను పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకటిన్నర కిలోమీటర్ తొవ్వారని అన్నారు. కల్వకుర్తి, కోయిల్ సాగర్ భీమాసాగర్ పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.