Read News in Telugu Language
adsdaksha

గులాబీ ఎమ్మెల్యేల హై డ్రామా .. అసెంబ్లీ నుంచి వాకౌట్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 15

అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ అవినీతి పాలనను ఎండగట్టిన సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) పై బీఆర్ఎస్ ( brs ) ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తూ సభనుండి వాకౌట్ చేశారు. సీఎం ఇతర మంత్రుల ప్రసంగాలను తట్టుకోలేక గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హై డ్రామా ప్లే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాడిన భాష బాగాలేదంటూ సీఎం, మంత్రులు మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరుపులతో గందరగోళం సృష్టించారు. శాసనసభ స్పీకర్ వారించినా వినకండా.. కావాలని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడకుండా మీడియా పాయింట్ వద్దకు మాట్లాడటానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చల్స్ అడ్డుకున్నారు. సభ నడుస్తున్నప్పుడు మీడియా పాయింట్ ( media point ) వద్ద ప్రెస్ మీట్స్ కు పర్మిషన్ లేదని చెప్పిన మార్చల్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ( mla ) లు వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా అక్కడే భైఠాయించి నిరసన తెలిపారు.

read also : ఘనంగా వసంత పంచమి.. కిటకిటలాడిన ఆలయాలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ను స్పీకర్.. చీఫ్ మార్షల్ ద్వారా చర్చలకు ఆహ్వానించారు. స్పీకర్ ఆహ్వానాన్ని లెక్క చేయకుండా అసెంబ్లీ ఆవరణ నుంచి గులాబీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువుతు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి భాష సరిగ్గాలేదని ఫైర్ అయ్యారు. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని, అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని విమర్శించారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని తాము కోరుదామంటే తమకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వట్లేదని ఆరోపించారు.

Hospital

read also : భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త .. మేడారం ప్రసాదం హోం డెలివరీ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ..

సీనియర్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన భాష బాగాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగిం చాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అసెంబ్లీలో కావాలనే తమ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.

read also : కానిస్టేబుల్ గా సెలక్టైన అభ్యర్థుల నిరీక్షణకు తెర .. నేడు ఎల్బీస్టేడియంలో సీఎం రేవంత్ చేతుల మీదుగా అపాయింట్మెంట్స్ ..

అసెంబ్లీలో మాట్లాడటానికి తగినంత సమయం ఇచ్చినా, కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న గందరగోళాన్ని గమనిస్తున్న ప్రజలు.. గులాబీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.