Read News in Telugu Language
adsdaksha

ఉద్యోగాలు ఇచ్చే చాతకాలే.. మేం 25 వేల నౌకర్లు ఇచ్చాం: సీఎం రేవంత్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 15

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మనసు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) విమర్శించారు. 3650 రోజులు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ( brs ) కు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదని… వాళ్ల పాలనలో దోచుకున్నది.. దాచుకోవడంపైనే దృష్టిపెట్టారని దుయ్యబట్టారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియం ( lb stadium ) లో గురువారం నియామక పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. కాంగ్రెస్ ( congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని రేవంత్ తెలిపారు.

read aalso : కాళేశ్వరం కాగ్ రిపోర్టు సభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ..

Hospital

ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ల కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించి బీఆర్ఎస్ ను ప్రజలు గద్దె దించారన్నారు. మేడిగడ్డ పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టారని రేవంత్ తెలిపారు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. కాగ్ నివేదికను శాసనసభలో పెట్టామని వివరించారు. ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా పారిపోయారని దుయ్యబట్టారు. అధికారమిస్తే చేసి చూపిస్తానంటున్నారు హరీశ్ రావు. పదవి రావాలంటే ఆయన మరో ఔరంగ జేబు అవతారం ఎత్తాల్సిందే అని వ్యాఖ్యానించారు.

read alsso : సివిల్స్ నోటిఫికేషన్.. మే 26న ప్రిలిమ్స్.. అక్టోబర్ 19న మెయిన్స్ ..

త్వరలో గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామని అన్నారు. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం విద్యపై ఖర్చు చేసింది కేవలం 6శాతం మాత్రమే అని, దాన్ని 10 నుంచి 12శాతానికి పెంచి గురుకుల పాఠశాలలను బలోపేతం చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.