Read News in Telugu Language
adsdaksha

14సీట్లు పక్కా రావాలి : కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 26

లోక్‌సభ ఎన్నికలు మా 100 రోజుల పాలనకు రెఫరెండమని, 14 ఎంపీ స్థానాలను గెలవాలనే పట్టుదలతో ఉన్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) అన్నారు. మంగళవారం చేవెళ్ల ( chevella ) పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో సీఎం రేవంత్ సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తుక్కుగూడ ( thukkuguda ) లో ఏప్రిల్ 6 లేదా 7న జాతీయస్థాయి సభ నిర్వహిస్తామన్నారు.

రంగారెడ్డి జిల్లా నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామని, ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరవుతారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభ నుంచే జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించబోతున్నామని, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

read also : ఢిల్లీ సీఎం రెండో ఆదేశాలు జారీ.. ఈడీ కస్టడీలో ఉండి కేజ్రీవాల్ ఉత్తర్వులు..!

Hospital

మరోవైపు బీజేపీ పాలనతో దేశానికి ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిన అనేక సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో యువతను, రైతులను మోదీ మోసం చేశారని మండిపడ్డారు. మోదీ నిర్ణయంతో ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశ ప్రజల బాధలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశం అబివృద్ది చెందుతుందని సీఎం తెలిపారు.

read also : 1671 గవర్నమెంట్ పాఠశాలలు బంద్.. ఉత్తరాఖండ్‌లో విద్యార్థులు లేక మూసివేత..

క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధిష్ఠానం అన్నిరకాలుగా ఆలోచించిన తర్వాతే చేవెళ్లకు రంజిత్ రెడ్డి, మల్కాజిగిరికి సునీతామహేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌కు దానం నాగేందర్‌లను అభ్యర్థులుగా ప్రకటించిందని వివరించారు.

 

Leave A Reply

Your email address will not be published.