Read News in Telugu Language
adsdaksha

భూముల ధరలు కోకాపేటంత పెరగాలి.. ముఖ్యనేతల సమావేశంలో సీఎం రేవంత్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 28

కొడంగల్ నియోజకవర్గంలోని భూముల ధరలు కోకాపేటంత పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కొడంగల్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తనను కొడంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, తాను ప్రచారానికి రాకున్నా భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారని అన్నారు. ముఖ్యమంత్రిని అయ్యి నియోజకవర్గానికి వచ్చానని, తనకు వచ్చిన ఈ అవకాశాన్ని కొడంగల్ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తానని అన్నారు.

Read also: కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల ..

తాను ఎక్కడున్నా, తన మనసు, కన్ను ఎప్పుడూ కొడంగల్ ప్రజలవైపే ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చారు. త్వరలో కొడంగల్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. కోకాపేటలో ఎకరం వంద కోట్లకు పలికిందంటే అక్కడ అభివృద్ధి జరగడం వల్లనే అని సీఎం అన్నారు. ఎక్కడైనా పరిశ్రమలు వస్తేనే, అక్కడి భూములకు విలువ పెరుగుతుందని అన్నారు. కొడంగల్ లోని భూముల ధరలు కూడా కోకాపేటంత రేటు పలకాలని, అందుకోసం నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తున్నానని అన్నారు.

Hospital

Read also: కోర్టుల్లో మౌలిక సౌకర్యాల కొరత : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్..

రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ ను నిలుపుతానని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలంటే రైతులు భూములు ఇవ్వాలని అన్నారు. పట్టా భూములు, ఆసైన్డ్ ల్యాండ్స్ కు ఒకే పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గతంలో కొడంగల్ లో అభివృద్ధి జరగకపోవడంతోనే స్థానిక ప్రజలు వలస పొయ్యారని ఆరోపించారు. కొడంగల్ ను మనం అభివృద్ధి చేసుకుంటే వలస పోయిన వారు తిరిగి వస్తారని అన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తి పోతల ద్వారా లక్ష ఎకరాలకునీళ్లు ఇచ్చుకు నే ప్రయత్నం జరుగుతుందన్నారు.

త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీకి 50వేల ఓట్ల మెజార్టీ రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పనిచేయాలని నాయకులకు సూచించారు. బూత్, మండల, సెగ్మెంట్ లెవల్ లో ఐదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు వేసుకోవాలన్నారు. తాను మళ్లీ ఏప్రిల్ 8న ఇక్కడికి వచ్చి కమిటీ సభ్యులతో మాట్లాడుతానని చెప్పారు. ఈ కమిటీలే ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయని, ప్రతి పథకం కూడా ఈ కమిటీలు చెప్పిన వారికే అందుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.