Read News in Telugu Language
adsdaksha

ఇండియా కూటమిని గెలిపించాలి : సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 6

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( cm revanth reddy ) పిలుపునిచ్చారు. జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండాను ఎగురవేయాలన్నారు. హైదరాబాద్ ( hyderabad ) శివారులోని తుక్కుగూడ ( tukkuguda ) లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించిన విధంగానే కేంద్రంలో బీజేపీ ( bjp ) ని ఓడించాలన్నారు.

Read also: న్యాయ్ పత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో..విడుదల చేసిన రాహుల్ గాంధీ..

Hospital

కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని సీఎం రేవంత్ కోరారు. కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. గుజరాత్ మోడల్ పై ‘వైబ్రెంట్ తెలంగాణ’ శాసిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్లాక్ ఫార్మింగ్ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు 17 నెలల పాటు పోరాడారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 750 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదని మండిపడ్డారు.

Read also: పార్టీ పేరు మార్పు కలిసిరాలేదు .. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి..

తెలంగాణను కేసీఆర్ కుటుంబం పదేళ్లు దోచుకుందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారన్నారు. తాను ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటానని కేసీఆర్ భావిస్తున్నారు. అలా సెటిల్ అవ్వడానికి నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డి. అలా మాట్లాడితే కేసీఆర్ ను జైల్లో పెడతాం అన్నారు. చర్లపల్లి జైలులో ఆయనకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం అన్నారు. అతని కాలు విరిగింది. కూతురు జైలుకు వెళ్లినందుకు చింతిస్తున్నాం అన్నారు. రాష్ట్రానికి ఢిల్లీ నుంచి నిధులు కావాలంటే 14 మంది ఎంపీలను గెలిపించండి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.