Read News in Telugu Language
adsdaksha

రాసిపెట్టుకోండి రాహులే ప్రధాని ..విజయన్ కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు : వయనాడ్‌ రైతుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 18

విజయన్ కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) అన్నారు. రాసిపెట్టుకోండి.. జూన్ 9న ప్రధానిగా రాహుల్ గాంధీ ( rahul gandhi ) ప్రమాణస్వీకారం చేయడం ఖాయం అన్నారు. కేరళ ( kerala ) లోని వయనాడ్‌ ( vayanad ) లో గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేరళ ప్రజల శ్రమ వల్ల దుబాయ్ లాంటి దేశాలు అభివృద్ధి చెందాయని, కేరళ మాత్రం అభివృద్ధి కాలేదన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగిపోయారన్నారు. బంగారం స్మగ్లింగ్ లో సీఎం విజయన్ ( cm vijayan ) కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

read also : యువ సేవాసమితి ఔదార్యం.. అనాధ వృద్ధురాలకి నెలకు సరిపడా సరుకులు పంపిణీ ..

సీఎం విజయన్ పై ఈడీ, ఆదాయపన్ను కేసులున్నా.. ఆయనపై మోడీ చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీతో కేరళ సీఎం విజయన్ రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాల ప్రయోజనాలు, నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కేంద్రంతో నిధుల కోసం పోరాడుతున్నాయన్నారు. కేరళ సీఎం విజయన్ మాత్రం కేంద్రంతో ఎలాంటి పోరాటం చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పైకి సీపీఎం ముఖ్యమంత్రిగా, కమ్యూనిస్టు నాయకుడిగా కనిపిస్తున్న విజయన్.. కమ్యూనిస్టు కాదు.. కమ్యూనలిస్టు అని తేల్చిచెప్పారు.

Hospital

read also : ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా.. జూలై 24న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం..

మతతత్వ బీజేపీతో కలిసి విజయన్ పని చేస్తున్నాడని, వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కి కేరళ ముఖ్యమంత్రి విజయన్ మద్దతు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత పార్టీ సీపీఎంతో పాటు కేరళ ప్రజలను పినరయి విజయన్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈడీ, ఆదాయపన్ను కేసులున్ననని రోజులు సీపీఎం పార్టీ కోసం విజయన్ పనిచేయరన్నారు. మణిపూర్‌లో వందలాది మంది క్రిస్టియన్లు బీజేపీ గుండాల చేతిలో చనిపోయారని తెలిపారు. దేశంలో రెండు పరివార్ ల మధ్య పోరాటం జరుగుతోందని, మోడీ పరివార్ లో ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, ఇన్కంట్యాక్స్, అదానీ, అంబానీ ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పరివార్‌లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , వాయనాడ్ కుటుంబ సభ్యులున్నారని తెలిపారు.

read also : Dehydration : ప్రమాదకరంగా పిల్లలలో డీహైడ్రేషన్.. జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు..

రాహుల్ గాంధీ పై వాయనాడ్ ప్రజల అభిమానాన్ని చూద్దామనే నేను తెలంగాణ నుంచి వచ్చా అని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని మేం రాహుల్ గాంధీని కోరామన్నారు. కానీ.. వాయనాడ్ వైపే ఆయన మొగ్గు చూపారన్నారు. గత ఎన్నికల్లో వాయనాడ్‌లో 65 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ సారి 75 శాతం ఓట్లు రావాలన్నారు. వారణాసి వర్సెస్ వయనాడ్ మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని, వయనాడ్ ప్రజలు ఓటు వేయబోయేది కేవలం ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదు దేశానికి కాబోయే ప్రధానికి అని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.