Read News in Telugu Language
adsdaksha

భూమి ఆకాశం తలకిందులైనా కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉరేసుకుని సచ్చినా రుణమాఫీ చేసి తీరుతాం : సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 23

భూమి ఆకాశం తలకిందులైనా కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉరేసుకుని సచ్చినా రైతులకు రుణమాఫీ ఆపబోమని, రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా.. భూమి, ఆకాశం తలకిందులైనా, కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉరేసుకుని సచ్చినా ఆగస్టు లోపల రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పలు పార్టీల నాయకులు మాయమాటలు చెప్పి మిమ్మిల్ని మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారని, వంద మాటలు చెబుతారని అవన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

రైతులెవ్వరూ అధైర్యపడొద్దని సీఏం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని, రుణమాఫీ చేసే బాధ్యత తనదేనని అన్నారు.
కోడంగల్ లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు పాలమూరు నాయకులు ఎవరినో చేయిచాచి అడిగే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇప్పుడు ఇచ్చే స్థాయికి వచ్చామని అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించే స్థాయిలో కొడంగల్ బిడ్డ ఉన్నాడని అన్నారు. కొండగల్ ప్రజల ఆశీర్వాదంతో ఇదంతా సాధ్యమైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read also: జూన్ 16న యూజీసీ నెట్ ఎగ్జామ్.. నోటిఫికేషన్ విడుదల.. మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

పాలమూరు ప్రాంతానికి ఎన్నో ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూనే ఉందని సీఎం అన్నారు. ప్రస్తుతం పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తే.. డీకే అరుణ లాంటి వాళ్లు తనకు అడ్డు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగానంటూ డీకే అరుణ అంటున్నారని, మరి పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో, ఎందుకు అభవృద్ధికి నోచుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. డీకే అరుణకు తన మీద కోపం, అసూయ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఆమెను అవమానించాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. 70 ఏళ్ల తరువాత పాలమూరుకు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందని, ఆ అవకాశాన్ని కొందరు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Hospital

కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే.. ఆయన కనీసం కొడంగల్ వైపు తిరిగి చూడలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదేళ్లే సీఎంగా ఉంటే నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. పాలమూరు బిడ్డలంతా ఈ ఐదేళ్లు తనకు అండగా ఉండాలని కోరారు. వందేళ్ల అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి అందరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే చాలా గౌరవం కానీ దొరల గడీలను కూలుస్తానని రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్పీ కి.. ఆరు నెలల్లోనే ఆ దొర ఎందుకు మంచొడయ్యాడని ప్రశ్నించారు. డీకే అరుణ, ఆర్ఎస్పీతో నాకు శతృత్వం లేదని, జెండాలు పక్కన పెడదాం అభివృద్ధికి కలిసిరండన్నారు.

Read also: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు మృతి..

దొంగలకు సద్దిమూటలు మోసే నేతలు ఇక్కడున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్ వరద బాధితులను కేసీఆర్ ఆదుకున్నారా?.. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిందెక్కడ? అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.