Read News in Telugu Language
adsdaksha

36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాదే : సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే1

అసెంబ్లీ ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలిపి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. బుధవారం కూకట్ పల్లి ( kukatpalli ) లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ( congress ) పార్టీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం అన్నారు. మోదీ ( modi ), కేడీ కలిసి 1200 రూపాయలకు సిలిండర్ రేటు పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం 500 లకే ఇస్తోందన్నారు. మీ ఇంటికి తాగునీరు ఉచితంగా ఇవ్వాలంటే, సమస్యలు తీరాలంటే సునీతా మహేందర్ రెడ్డి ( sunitha mahender reddy ) ని గెలిపించాని కోరారు.

read also : రఘురాం రెడ్డి రోడ్ షో కి విశేష స్పందన.. హాజరైన మంత్రి పొంగులేటి, భట్టి..

కేసీఆర్ కుట్ర చేసి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి 2018లో కొడంగల్ లో నన్ను ఓడించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ లో ఓడించినా మల్కాజ్ గిరి ఎంపీగా నిలబడితే కూకట్ పల్లి బిడ్డలు నాకు అండగా నిలబడి గెలిపించారని చెప్పారు. మల్కాజ్ గిరి ప్రజలు గెలిపించారు కాబట్టే సోనియా గాంధీ పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని తెలిపారు.

Hospital

read also : ఆకాశంలో సగం అవకాశాలు మాత్రం శూన్యం : ఆయేషా సుల్తానా ..

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన వారి సమస్యలను పరిష్కరిస్తాం..

కేసీఆర్, మోదీ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ తెలంగాణకు మెట్రో కొత్త లైన్ ఇవ్వలేదని, మూసీ ప్రక్షాళనకు కూడా నిధులు ఇవ్వలేదన్నారు. ఢిల్లీ నుంచి మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు తెచ్చారని, పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటేస్తారా? గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటేస్తారా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సునీతా మహేందర్ రెడ్డికి వేసే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లే అన్నారు. మల్కాజ్ గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.