Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం జిల్లా రాజకీయాలు రాష్ట్రానికే దిక్సూచి.. ఇక్కడి నాయకులు రాజకీయాల్సే శాసించగల దిట్టలు : సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : మే 4

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఇక్కడి రాజకీయాలు రాష్ట్రానికే దిక్సూచి వంటివని సీఎం రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) అన్నారు. ఇక్కడి నాయకులు రాష్ట్ర రాజకీయాల్నే శాసించగల దిట్టలని కొనియాడారు. నాడు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నది తెలంగాణ ప్రజలే అని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో అత్యధిక మెజార్టీ ఇచ్చే ప్రాంతంగా ఖమ్మం జిల్లా మరో సారి పోరాట పటిమను చాటాలని పిలుపునిచ్చారు.

శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు హక్కులు కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఖమ్మం జిల్లా పోరాట యోధుల త్యాగనిరతిని కొనియాడారు. ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. 2014లో టిఆర్ఎస్ కు ఒక్క సీటు ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఇప్పుడు కూడా ఒకే సీటు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఒక్క సీటు గెలుచుకున్న సోదరుడు కూడా ఇప్పుడు మనతోనే ఉన్నారన్నారు. కాలకూట విషం లాంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రజలు 100 మీటర్ల బొందతీసి పాతిపెట్టారని రేవంత్ ఎద్దేవా చేశారు.

read also : రఘురాం రెడ్డిని ఆదరించి.. కాంగ్రెస్ కే జై కొడదాం : సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి..

రాష్ట్రంలోనే ఖమ్మంది ప్రత్యేక స్థానం : రేవంత్ రెడ్డి..

Hospital

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 23 జిల్లాలు ఉంటే 22 జిల్లాలకే మీరు ముఖ్యమంత్రి అని ఖమ్మం రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం కావడంతో వారిని వారే పరిపాలించుకుంటారనే వ్యాఖ్యలు వినిపించేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని భట్టే ఖమ్మం జిల్లా ప్రత్యేకత అర్థమవుతుందన్నారు. 2014 నుండి 23 వరకు రాజకీయం చేసిన కేసిఆర్ కారు గుర్తను ఢిల్లీలో తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కారు ఖార్ఖానాకు పోయిందని కేసిఆర్ చెప్పుతున్నారని, కారు ఖార్ఖానాకు కాదు కారు అనుంచెడి తుక్కుపట్టి షెడ్డుకు పోయిందన్నారు.

డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్ మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మే 13న జరిగే ఎన్నికలే ఫైనల్ అని, రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేయడమే ఫలితమన్నారు. ఇక్కడ ఎంపీగా రఘురాం రెడ్డిని, మహబూబాబాద్ లో బలరాం నాయక్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

read also : పగిడిపల్లి నాగేశ్వరరావు ఇంటికి కరెంట్ ఇవ్వండి : డాక్టర్ కె.వి. కృష్ణా రావు ..

తెలంగాణకు ద్రోహం చేసిన బిజేపి మళ్ళీ వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియమ్మ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చంపి బిడ్డను ( తెలంగాణ ను ) బతికించిందన్నారు. భట్టి గట్టివాడు కనుక రూ. లక్షల కోట్ల అప్పుల సంసారాన్ని గట్టెక్కిస్తూ, 1 వ తేదీనే అందరికి జీతాలు ఇస్తున్నారన్నారు. ఈ నెల 8 లోపు రైతు భరోసా చెల్లించి రైతుల రూ. 7 లక్షల కోట్ల అప్పు చెల్లిస్తాం అన్నారు. భద్రాచలం రాముల వారి సాక్షిగా ఆగష్టు 15లోపు రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
కొత్తగూడెం శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.