Read News in Telugu Language
adsdaksha

ప్రపంచంతో పోటీ పడేలా ఆరు నూతన పాలసీలు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…

దక్ష న్యూస్, హైదరాబాద్: మే 22

పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీపడేలా ఆరు కొత్త పాసీలను రూపొందిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎంరేవంత్ రెడ్డి ( cm revanth reddy ) సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.

Read also: పది వర్శిటీలకు ఇంచార్జ్ వీసీల నియామకం..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

Hospital

టెక్స్ టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా రూపొందిస్తున్న ఆరు పాలసీలపై అధికారులు ముఖ్యమంత్రి తో చర్చించారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్ పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తుమన్నామని రేవంత్ రెడ్డికి వివరించారు.

Read also: సెల్ ఫోన్ చూసే ప్రతీ ఒక్కరికీ మల్లన్న పోరాటం తెలుసు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.