Read News in Telugu Language
adsdaksha

ధ్యాన మందిరం కోసం నిధులు మంజూరు చేస్తాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: మే 23

బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని మహా బుద్ధ విహార్ ను సీఎం రేవంత్ రెడ్డి  ( cm revanth reddy ) సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని అన్నారు.
రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారని చెప్పారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని, ప్రతీ పనిని ధ్యానం లా దీక్షగా  చేయాలన్న సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానని అన్నారు. ఏ పని అయినా నేను ఎంతో భక్తిగా చేస్తానని అన్నారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Hospital

Read also: మద్యం తరలిస్తున్న లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ స్థానికులు..

మహా బుద్ధ విహార్ లో ఒక పాఠశాలను నిర్వహించాలని నేను కోరుతున్నానని సీఎం అన్నారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయని, సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉందన్నారు. ఈ సమయంలో ప్రజలకు బుద్ధుడి సందేశం చాలా అవసరమని అన్నారు. బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తి గా, ప్రభుత్వంగా సాయం చేస్తామన్నారు. తెలంగాణలో బుద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని, ఈ ప్రభుత్వం మీది అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.