Read News in Telugu Language
adsdaksha

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు..

దక్ష న్యూస్, ఖమ్మం : జూన్ 10

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లో సీఎం ఏనుముల రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) తెలంగాణ ఉద్యమ కారులకి ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం , నిజమైన తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించ టానికీ కమిటీ ఏర్పాటు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి కృష్ణారావు అన్నారు.

Hospital

ఖమ్మం మయూరి సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలన్నింటిని ఆదుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమ కారులందరికీ గుర్తింపు కార్డులు, పెన్షన్, ఉచిత ఆరోగ్య కార్డు, బస్ పాస్ లు ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిజమైన ప్రతి ఉద్యమ కారుడికి వర్తింపచేయాలని కోరారు.

Read also: ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు .. 1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంపు..

ఈ కార్యక్రమంలో బచ్చల పద్మ చారి , పెళ్లూరి విజయ్ కుమార్ , నేలవెళ్లి వెంకటేశ్వరావు , భూక్యా రాంబాబు నాయక్ , అర్వపల్లి విద్యాసాగర్ , Sk అబ్బాస్ అలీ , బాలిన భాస్కర్ రెడ్డి , భూక్యా శ్రీనివాస్ నాయక్ , పగడాల నరేందర్ , లింగనబోయిన సతీష్ , బట్టు రాజేంద్ర నాయక్ , కోడి రెక్క ఉమాశంకర్ , బొబ్బిలి భరత్ చంద్ర , సర్దార్ , గుంతేటి వీరభద్రం , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , రెడ్డి బోయిన వరలక్ష్మి , ఉదయ్ భాస్కర్ , జోకు పర్తి రాజా , అనంత లక్ష్మి , ఏక లక్ష్మి , కృష్ణ వేణి , పద్మ స్వరూప , ధన లక్ష్మి , ఉల్లంగి పద్మ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.