Read News in Telugu Language
adsdaksha

28 నుంచి మరో రెండు గ్యారెంటీలు..మహిళలకు రూ 2,500 ఆర్థిక సాయం ..?

దక్ష న్యూస్, హైదరాబాద్‌: డిసెంబర్ 24

రూ.500కే గ్యాస్‌ సిలిండర్..

ధరణి పోర్టల్‌పై అభిప్రాయాల సేకరణ..

ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ అమలుపై సమీక్ష..

నేటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం దిశా నిర్దేశం..

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుండగా, అందులో మరో గ్యారంటీ అయిన ‘మహాలక్ష్మి పథకం’పై ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి ( cm revanth reddy ) అధ్యక్షతన నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో కీలక ప్రకటన చేయనున్నట్టు తెలిసింది.

Hospital

మహాలక్ష్మి ( mahalakshmi ) పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్‌సిలిండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఈనెల 28న కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి పథకం అమలుపై సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. మహిళలకు రూ. 2,500 ఇస్తామనే హామీ అమలుపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. లబ్దిదారుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై కలెక్టర్లకు సీఎం స్పష్టత ఇవ్వనున్నారు.

read also : Hyd: ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..

రెండు పథకాలకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని ఇప్పటికే అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించినట్టు తెలిసింది. గ్యాస్‌సిలిండర్‌ సబ్సిడీ కోసం ఇప్పటికే వినియోగదారులు గ్యాస్‌ ఎజెన్సీల వద్ద కేవైసీ కోసం బారులు తీరిన విషయం తెలిసిందే.

దీంతోపాటు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్న వాగ్దానంపై సర్కారు దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పదేండ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలన, పెండింగ్‌ పనులు, ఆర్థిక వనరులు తదితర కీలకాంశాలపై కలెక్టర్లు శ్వేతపత్రాలు సిద్ధం చేసినట్టు తెలిసింది. వాటిని సీఎం రేవంత్‌కు సమీక్ష సమావేశంలో అందించనున్నారు.

ధరణిపై సమగ్రంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం నియమ, నిబంధనలు రూపొందించనున్నట్టు తెలిసింది. వీటన్నింటితోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 10 లక్షలు అమలు తీరును కలెక్టర్లు రేవంత్‌కు వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.