Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే దమ్ముందా ..? ఊర్లకు వస్తే ప్రజలే తరిమి కొడతారు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 2

– ఇంద్రవెల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి..

ఈ పదేళ్ల మీ కుటుంబ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మీకు బుద్ది చెప్పి.. మా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికుంది అని ప్రశ్నించారు. మూడు, ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారనీ వాళ్ల ఆశలు అడియాశలు అవుతాయన్నారు. అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా.. మంత్రి పదవి కూడా రాదనీ ఎద్దేవా చేశారు.

శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పునర్నిర్మాణ సభతో లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఇంద్రవెల్లి మట్టికి గొప్పదనం ఉంది. ఇక్కడ వేసే ప్రతి అడుగులో పోరాట పటిమ ఉంది. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీగోండ్ గురించి ప్రస్తావించాలన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నామన్నారు.

Read also: ముత్తిరెడ్డి మమ్ముల్ని ముంచాడు.! మరో వివాదంలో జనగామ మాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి..

అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్ పాలనను అంతం చేశామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించాం అని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటాం అన్నారు.

Hospital

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లాల పర్యటనకు వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం, కేస్లాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేంసాగర్‌, సీఎస్‌ శాంతికుమారి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సీఎం నాగోబా ఆలయానికి వెళ్లారు. నాగోబా దర్శనానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి మోస్త్రం వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు.

Read also: పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు..

ఆదివాసీ సంప్రదాయ రీతిలో ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, 6 కోట్లతో చేపట్టనున్న నాగోబా ఆలయ అభివృద్ది పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

మహిళా సంఘాలతో సీఎం రేవంత్ ముఖాముఖి:

మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేస్లాపూర్లోని నాగోబా దర్బార్ లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్ లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే భారాస నేతలకు కడుపునొప్పి ఎందుకని ప్రశ్నించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.60 కోట్లకుపైగా రుణాలు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.