Read News in Telugu Language
adsdaksha

నీళ్ల దోపిడికి కారకుడు కేసీఆరే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తే సహించం : సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 4

ఆంధ్రప్రదేశ్ నీళ్ల దోపిడికి కారకుడు కేసీఆరే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని గుర్తు చేశారు. ఆదివారం హైదరాబాద్ లో సీఎం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Read also: 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ కృష్ణా నీటి ప్రాజెక్టులు ఎడారిగా మారాయని ఆక్షేపించారు. పాలమూరు రంగారెడ్డికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి కేసీఆర్ ఒక్క ఎకరాకు నీళ్వివ్వలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 27 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ. 67 వేల కోట్లకు అంచనాలు పెంచారని దుయ్యబట్టారు.

Read also: బీజేపీలో చేరమన్నారు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

Hospital

కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అలా చేస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలోనే ఉందని చెప్పారు. కేంద్రం తనను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ పై వేయాలని చూస్తున్నారని, విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం జరిగిందన్నారు. కృష్ణానదిలో 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసిందని సీఎం గుర్తు చేశారు.

Read also: కాళేశ్వరం తో లక్షల కోట్ల ప్రజాధనం నీటి పాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించారని అన్నారు. దానికి అప్పటి సీఎం కేసీఆర్, అధికారులు అంగీకరించి సంతకాలు చేశారని తెలిపారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో సంతకాలు చేశారని, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Read also: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 వేల పెన్షన్ : సీఎం రేవంత్ రెడ్డి ..

రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంట్లో ప్రశ్నించలేదన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు కృష్ణాలో 50 శాతం నీటి వాటా కావాలని అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తోందని అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారు. దీనికి కేసీఆర్, హరీశ్ రావు సహకరించారు. దీని వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి పోరాటం చేశారని రేవంత్ గుర్తు చేశారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పదేళ్లలో కేసీఆర్ ఒక్క కిలోమీటరే తవ్వించారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పూర్తికాలేదని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.