Read News in Telugu Language
adsdaksha

15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాలు .. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది : సీఎం రేవంత్ రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 8

తెలంగాణలో ఉద్యోగ ఖాళీలన్నీ త్వరలో భర్తీ చేస్తామని.. 15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ అన్నారు. నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళాకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఒక కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు ఊడగొడితే, 441 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగదని, 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అభ్యర్థులు పరీక్షల తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని సూచించారు.

Hospital

Read also: ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

తమది ప్రజాప్రభుత్వమని, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, సింగరేణి సీఎండీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.