Read News in Telugu Language
adsdaksha

రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండరాదు : సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 30

రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు.

Hospital

Read also: కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. ఐటీ నోటీసులు జారీ..

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి కొరత లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, జూన్‌ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులను వినియోగించుకోవాలని సీఎం అన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు -కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇన్వాటర్‌ ట్యాంకులు సిద్ధంగా ఉంచాలని, ట్యాంకర్లు బుక్‌ చేసుకుంటే 12 గంటల్లో వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.