Read News in Telugu Language
adsdaksha

కంపెనీ ఓనర్లను బాధ్యులను చేసినప్పుడే నకిలీ విత్తనాల నియంత్రణ సాధ్యం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 24

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపండి : సీఎం రేవంత్ రెడ్డి..

నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే ప్రమాదకరమైనవని సీఎం రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) అన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు నకిలీ విత్తనాల ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆదివారం బి.ఆర్. అంబేద్కర్ సచీవాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ లు, సీపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నకిలీ విత్తనాలపై ఫైర్ అయ్యారు. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నకిలీ విత్తనాలే కారణం అన్నారు. నకిలీ విత్తనాల వెనుక ఉన్న కార్పొరేట్ కంపెనీలు సేల్స్ కోసం ఏవరో ఏజంట్ ను అపాయింట్ చేస్తడు. ఏజంట్ విత్తనాలు అమ్ముతాడు. అధికారులు కంపెనీ మీద కేసు పెట్టకుండా లాస్ట్ పాయింట్ మీద కేసు పెట్టగానే మరుసటి రోజు విత్తనాల కంపెనీ పేరు మార్చుతాడు. అంతకుముందు అన్న పేరు మీద లైసెన్సు ఉంటే తమ్ముడి పేరు మీద నడిపిస్తడు. అధికారులు నోటీసులు ఇవ్వగానే బోర్డు తిప్పేసి నకిలీ విత్తనాల దందా నడిపిస్తున్నారన్నారు.

read also : book my show : బుక్ మై షో ఫ్లాట్ ఫాం మీద ఎంక్వైరీ చేయండి.. పోలీస్ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ ..

Hospital

రౌడీషిటర్ల మాదిరిగా నకిలీ విత్తనాలు అమ్మే వారి మీద పోలీసులు స్టేట్ అంత ఒక యునిట్ కింద క్రిమినల్స్ కోసం ఎలాగైతే డేటా బేస్ తయారుచేసుకుంటారో అలాగే నకిలీ విత్తనాల మీద కూడా చర్యలు తీసుకొని ఉక్కుపాదంతో అణచి వేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కంపెనీ ఓనర్లను బాధ్యులను చేసినప్పుడే నకిలీ విత్తనాల నియంత్రించబడుతాయని పేర్కొన్నారు. పెద్ద కంపెనీలు ఎప్పుడూ కింద ఉన్న ఎవరినో చూపెడతారని, రైతులకు నష్ట పరిహారం ఇవ్వడానికి నకిలీ విత్తనాల కంపెనీల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్టు కింద జప్తు చేయాలన్నారు.

పోలీసులు డ్రగ్ మాఫీయా తో సంబంధమున్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నారు. ఈడీ కేసులు ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తున్నరు.. నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీల ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. జవాబుదారితనం వారికి ఎందుకు లేదు.. చట్టంలో సీజ్ చేసే అవకాశం లేకుంటే చట్టాన్ని సవరించుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాఅన్నారు. రైతులు చనిపోవడానికి ప్రధాన కారణమైన నకిలీ విత్తనాలను క్షమించే సమస్యే లేదన్నారు. అధికారులు వీటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

read also : రేవంత్ మార్క్ పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అదిరిపోయే ప్రసంగం చేసిన సీఎం..

మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు పెంచేలా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేసే వారిపై కూడా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. ఇలా చేసేవారి సమాచారం సేకరించి వారందరిని ఒక లైన్ లోకి పట్టుకురావాల్సిన అవసరముందన్నారు. ఏ విధంగా వారిని కంట్రోల్ చేయాలనేది ఆలోచించాలని అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.