Read News in Telugu Language
adsdaksha

ఆటైనా సీటైనా అదే పోరాటం.. గచ్చిబౌలి మైదానంలో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 12

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రచారంలో తలమునకలైన సీఎం రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) శనివారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో రిలాక్స్ అయ్యారు. దాదాపు నెల రోజులపాటూ విరామం లేకుండా సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ముగియడంతో మైదానం బాట పట్టారు.

Hospital

read also : తెలంగాణ కు వర్ష సూచన.. మూడు రోజుల పాటూ వర్షాలు..

ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో గచ్చిబౌలి మైదానంలో ఫుట్ బాల్ టోర్నీని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. బంతిని గోల్ చేసేందుకు విద్యార్థులతో కలిసి విపరీతంగా పోటీపడ్డారు. సీఎం హోదాను మరచిపోయి రేవంత్ రెడ్డి ఆటఆడే సమయంలో ఓ విద్యార్థిలా మారిపోయారు. ఆట మధ్యలో సీఎం షూ పాడైపోయి అంతరాయం కలిగినా మైదానంను వీడకుండా షూ లేకుండానే సాక్స్ లతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడారు. సీఎం రేవంత్ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు రేవంత్ ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.