Read News in Telugu Language
adsdaksha

కేబినేట్ సమావేశానికి లభించని ఈసీ అనుమతి .. వాయిదా పడ్డ మంత్రివర్గ సమావేశం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 18

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై శనివారం నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో, వాయిదా పడింది. మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) అధ్యక్షతన జరగాల్సిన ఈ సమావేశం కోసం మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ విభాగాల అధికారులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి చూశారు. రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భేటీ జరగలేదు.

రైతాంగానికి సంబంధించిన అత్యవసరమైన అంశాలతో పాటు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణ, రాష్ట్ర పునర్విభజనకు పదేండ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై కేబినేట్ లో చర్చించాలని ముఖ్యమంత్రి భావించారు.

read also : జూన్ 9న టిజిపిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష.. ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఆదేశం..

సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

Hospital

ఇదిలాఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు.

ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటం వంటి అంశాలను పరిశీలించిన ఎన్.డి.ఎస్.ఎ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు, సిఫారసులను అధికారులు వివరించారు.

read also : Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలి : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్..

2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో స్పష్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అందుకు సీఎం రేవంత్ మాట్లాడుతూ, మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినేట్‌లో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. రిపేర్లు చేయడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనేది నీటి పారుదల విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

కేబినేట్ భేటీ జరగకపోవటంతో ఈ కీలకమైన అంశాలపైనా చర్చించలేకపోయామని సీఎం అన్నారు. . త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్‌లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.