Read News in Telugu Language
adsdaksha

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం : సీఎం రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 31

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే సీఎం రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) అన్నారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేం లేదన్నారు. తమ కుటుంబ సభ్యుల పదవుల గురించి తప్ప గత పాలకులు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచనే చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని నిరుద్యోగులను ఉద్దేశించి విమర్శించారు. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే… మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతుండు..
హారీష్ రావు గారు… పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు.
అవాకులు చెవాకులు పలకడం కాదు… ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండి అంటూ చురకలంటించారు.

Hospital

Read also: పాలన పరుగులు పెట్టాలి.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి..

కేసీఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండని కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.
మా ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది.
త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం. ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా…నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు మేం కట్టుబడి ఉన్నాం అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీ ఎం అన్నారు. మీ కళ్ళల్లో ఆనందం చూసి..ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుల్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదన్నారు.

Leave A Reply

Your email address will not be published.