Read News in Telugu Language
adsdaksha

గృహలక్ష్మి దరఖాస్తుల విచారణ ముమ్మరం..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: సెప్టెంబర్ 2

తెలంగాణ ( telangana )  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గృహలక్ష్మి ( gruha lakshmi ) పధకానికి వచ్చిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతున్నట్లు  భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా ( bhadradri kottagudem district ) కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ( collector dr.priyanka ) తెలిపారు. గృహాలక్ష్మి దరఖాస్తులు విచారణ ప్రక్రియపై కలెక్టర్ శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. గృహలక్ష్మి దరఖాస్తుదారుల వద్దకు ప్రభుత్వ సిబ్బంది వెళ్లి పరిశీలన చేస్తున్నారని చెప్పారు. స్థలాల పరిశీలన, వివరాల సేకరణ లో అధికారులు బిజీగా ఉన్నారని తెలిపారు. జిల్లాలో సొంతింటి కోసం 86,773 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. పథకానికి గత నెలలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించామని పేర్కొన్నారు.

Hospital

read also : మూడు రోజుల్లో క్షేత్ర స్ధాయిలో విచారణ పూర్తవ్వాలి..

గృహలక్ష్మి పధకానికి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో ఇప్పటికే సర్వే ప్రారంభించారని కలెక్టర్ అన్నారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు గ్రామాలు, పట్టణాల్లో క్షేత్ర స్థాయి సర్వే చేస్తున్నారన్నారు. గ్రామాల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, మున్సిపాలిటీల పరిధిలో అధికారులు, సిబ్బంది నేరుగా దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి స్థలాలను పరిశీలిస్తున్నారన్నారు. దరఖాస్తుకు జత చేసిన ఆధారాల వారీగా వివరాలు సేకరిస్తున్నారని, దరఖాస్తు దారులు విచారణ టీములకు ఆధారాలు చూపాలని చెప్పారు. విచారణ ప్రక్రియను ఆర్డీఓ లు తనిఖీ చేయాలని కలెక్టర్ స్పష్టంచేశారు.

Leave A Reply

Your email address will not be published.