Read News in Telugu Language
adsdaksha

3న ప్రజా పాలన గ్రామ సభల షెడ్యూల్ ఇదే : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 2

ప్రజాపాలన ఐదవ రోజు సందర్భంగా బుధవారం జిల్లాలో 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 116 ప్రదేశాలలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ( collector v.p. gautham ) తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం మండల/గ్రామ/మున్సిపాలిటీలలో గ్రామ సభల నిర్వహణ జరుగుతుందన్నారు.

ఉదయం షెడ్యూల్‌ లో 8 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు బోనకల్‌ మండలం రాయన్నపేట బ్రాహ్మనపల్లి, చింతకాని మండలం పందిల్లపల్లి, కోమట్లగూడెం, ఏన్కూరు మండలం భద్రుతండా, శ్రీరాంగిరి, కల్లూరు మండలం వెస్ట్‌లోకవరం, కల్లూరు, ఎర్రబోయినపల్లి, కామేపల్లి మండలం రామకృష్ణాపురం, పింజరమడుగు, ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు, గోళ్ళపాడు, కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగు, రాజ్యతండా, కూసుమంచి మండలం కూసుమంచి, నాయకన్‌గూడెం, పాలేరు, మధిర మండలం చిలుకూరు, మధిర మున్సిపాలిటీ 17 వ వార్డు, 3వ వార్డు, ముదిగొండ మండలం బాణాపురం, ముదిగొండ, నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి, పెనుబల్లి మండలం విఎంబంజర, కోండ్రుపాడు, రఘునాథపాలెం మండలం బూడిదంపాడు, మంచుకొండ, విఆర్‌బంజర, సత్తుపల్లి మండలం కాకర్లపల్లి, గంగారం, సింగరేణి మండలం సింగరేణి, గాదెపాడు, గిద్దవారిగూడెం. తల్లాడ మండలం కలకొడిమ, తల్లాడ, తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం, పిండిప్రోలు, ఏలువారిగూడెం, వేంసూరు మండలం కుంచపర్తి, అడసర్లపాడు, వైరా మండలం రెబ్బవరం, గరికపాడు, వైరా మున్సిపాలిటీ 9వ వార్డు, ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, గోసవాడు గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతాయన్నారు.

read also : ప్రజల చెంతకే ప్రభుత్వ పథకాలు..మీరిచ్చే ప్రతి దరఖాస్తు కంప్యూటరైజ్ చేస్తాం…

Hospital

మధ్యాహ్నం షెడ్యూల్‌ లో 2.00 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బోనకల్‌ మండలం మోటమర్రీ, కలకోట, చింతకాని మండలం బస్వాపురం, నేరడ, ఏన్కూరు మండలం కేసుపల్లి, రేపల్లెవాడ, కల్లూరు మండలం ఈస్ట్‌లోకవరం, కల్లూరు, పెద్దకోరుకొండి, కామేపల్లి మండలం నెమలిపురి, పాత లింగాల, ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌, పోలెపల్లి, కొణిజర్ల మండలం సింగరాయపాలెం, అమ్మపాలెం, కూసుమంచి మండలం కూసుమంచి, నాయకన్‌గూడెం, గురవాయిగూడెం, మధిర మండలం మాటూరుపేట, మధిర మున్సిపాలిటీ 19వ వార్డు, 12వ వార్డు, ముదిగొండ మండలం బాణాపురం, ముదిగొండ, నేలకొండపల్లి మండలం బోదులబండ, నాచెపల్లి, అనాసాగరం, పెనుబల్లి మండలం విఎం. బంజర, గణేష్‌పాడు, రఘునాధపాలెం మండలం చిమ్మపూడి, లచ్చిరాంతండా, మూలగూడెం, సత్తుపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు, 16 వ వార్డు, సత్తుపల్లి మండలం గౌరిగూడెం, గంగారం, సింగరేణి మండలం సింగరేణి, మాణిక్యారం, వెంకటియాతండా, తల్లాడ మండలం బస్వాపురం, బిల్లుపాడు, తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌ తండా పిండిప్రోలు, ఎదుల్లచెరువు, వేంసూరు మండలం బీరపల్లి, రామన్నపాలెం, వైరా మండలం గొళ్లపూడి, దాచపురం, వైరా మున్సిపాలిటీ 10 వ వార్డు, ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం, గుంటుపల్లి గోపవరం గ్రామాల్లో జరగనున్నట్లు వెల్లడించారు.

read also : మెట్రో విస్తరణపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ..

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉదయం 33వ డివిజన్‌ గాంధీనగర్‌, 34వ డివిజన్‌ రంగనాయకుల గుట్ట, 35వ డివిజన్‌ మోతినగర్‌, 36 వ డివిజన్‌ గాంధీచౌక్‌, 37వ డివిజన్‌ కమాన్‌బజార్‌, 38వ డివిజన్‌ ఖిల్లాబజార్‌, బికె బజార్‌, 39 వ డివిజన్‌ మేదరబజార్‌, 40 వ డివిజన్‌ మోమినాన్‌ బజార్‌, 42వ డివిజన్‌ రాజుదర్వాజ నిజాంపేటల్లో, మధ్యాహ్నం 33వ డివిజన్‌ గాంధీనగర్‌, 34వ డివిజన్‌ రంగనాయకుల గుట్ట, 35వ డివిజన్‌ మోతినగర్‌, 36వ డివిజన్‌ గాంధీచౌక్‌, 37వ డివిజన్‌ కమాన్‌బజార్‌, 38వ డివిజన్‌ ఖిల్లాబజార్‌, బికె బజార్‌, 39వ డివిజన్‌ మేదరబజార్‌, 40వ డివిజన్‌ మోమినాన్‌ బజార్‌, 42వ డివిజన్‌ రాజుదర్వాజ, నిజాంపేట ప్రాంతాలలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.