Read News in Telugu Language
adsdaksha

డాటా ఎంట్రీ పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలి : కలెక్టర్ వి.పి. గౌతమ్ ..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 9

ప్రజా పాలన దరఖాస్తుల్లో ప్రజలు పొందుపరిచిన డాటా నమోదు, ఏ చిన్న పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో చేపడుతున్న డాటా ఎంట్రీ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ని దరఖాస్తులు ప్రజాపాలన పోర్టల్ లో నమోదు చేసింది, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

Hospital

read aalsso : పవర్ స్టార్ “OG” ప్రాజెక్ట్ దానయ్య చేజారిందా..

రేషన్, ఆధార్ కార్డు నెంబర్లు జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ ఆపరేటర్ లకు సూచించారు. ఫిజికల్ దరఖాస్తులో ఉన్న వివరాలు సరితూగాలన్నారు. డాటా ఎంట్రీ నివేదిక ను ప్రత్యేక అధికారులు ర్యాండంగా సూపర్ చెక్ చేయాలని, డాటా ఎంట్రీపై పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. పరిశీలనలో దరఖాస్తులను డాటా ఎంట్రీ ఆపరేటర్లు సూచించిన ప్రదేశంలో మాత్రమే నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆయన తెలిపారు. కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ ఎంపిడివో రవీందర్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.