Read News in Telugu Language
adsdaksha

7 న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు..

దక్ష న్యూస్, ఖమ్మం : ఫిబ్రవరి 4

ఈ నెల 7, బుధవారం స్థానిక ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద గల టి.టి.డి.సి. సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ “ప్రధాన మంత్రి విశ్వకర్మ” అని పిలవబడే కొత్త పథకంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read also: నీళ్ల దోపిడికి కారకుడు కేసీఆరే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తే సహించం : సీఎం రేవంత్ రెడ్డి..

ఈ సదస్సు ఉదయం 10.00 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం సాంప్రదాయ/అసంఘటిత రంగంలో స్వహస్తాలతో లేదా పరికరాలతో ఉత్పత్తులు తయారు చేయువారు తమ తమ వృత్తులలో ఆధునిక ఉపకరణాలు నైపుణ్యంగా వినియోగించుకోవడమని ఆయన అన్నారు.

Hospital

Read also: 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

వృత్తి కళాకారులు, హస్తకళాకారులు సంపన్న సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, మరింత అభివృద్ధి చేయటం, వాటిపై అవగాహన పెంపొందేందుకు ఈ పధకం ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పథకంతో జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ అన్నారు.

Read also: బీజేపీలో చేరమన్నారు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

ఈ అవగాహనా సదస్సులో సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొంటారని, కమ్మరులు, స్వర్ణకారులు కుమ్మరులు, వడ్రంగులు, శిల్పులు మొదలైన వృత్తులలో నిమగ్నమై వున్న సాంప్రదాయ చేతివృత్తులవారు, హస్తకళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.