Read News in Telugu Language
adsdaksha

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 6

మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వి. పి గౌతమ్ ( collector v.p. gautham ) కోరారు. శనివారం లకారం టాంక్ బండ్ వద్ద జిల్లా యంత్రాంగంచే ఓటరు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఓటు ఎంతో కీలకమైందని మీరు ఖమ్మం ఎంపీ ని ఎన్నుకుంటే ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. దేశాన్ని శాసించే ప్రధాని ఎవరు ప్రభుత్వం ఏది అనేది మీ ఓటు ద్వారానే తెలుస్తుందన్నారు.

Read also: ఇండియా కూటమిని గెలిపించాలి : సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు ..

Hospital

మన దేశ భద్రత ఎలా ఉండాలి ఫారెన్ పాలసీ ఎలా ఉండాలి అనేది కూడా ప్రధానమంత్రి స్థాయిలో నిర్వహిస్తారని అన్నారు. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే అన్నారు. ఓటు హక్కు ఉన్న వారు తప్పకుండా ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలన్నారు.

Read also: న్యాయ్ పత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో..విడుదల చేసిన రాహుల్ గాంధీ..

మరో వారం రోజులు కొత్త ఓట్ల నమోదుకు అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పేరిణి తాండవం నృత్యం, ఆర్కెస్ట్రా, మిమిక్రి, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమం లో నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్స్ మయాంక్ సింగ్, యూవరాజ్, ఆర్డిఓ జి.గణేష్, జిల్లా రెవిన్యూ అధికారి రాజేశ్వరి, సిపిఓ శ్రీనివాస్, జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె. శ్రీరామ్, పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.