Read News in Telugu Language
adsdaksha

damini : దామిని యాప్ పై అవగాహన కల్పించండి.. కలెక్టర్ వి.పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 5

రాబోయే 48 గంటల్లో జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా వుండి, అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా ( khammam district ) కలెక్టర్ వి.పి. గౌతమ్ (  collector v.p. gautham ) అన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( cs shanthi kumari ) హైదరాబాద్ నుండి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, భారీ వర్షాల నేపధ్యంలో ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు.

గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు సంబంధిత తహసిల్దార్లతో టచ్ లో వుండాలన్నారు. ఇర్రిగేషన్ ఏఇ లకు వారి వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన వుండాలన్నారు. వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమై రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రమాదానికి ఆస్కారం వుండి, అవసరమున్నచోట రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

read also : గురుపూజోత్సవంలో పాల్గొనడం గొప్ప మధురానుభూతి ..

ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు. వర్షం లో జాలరులు చేపలు పట్టేందుకు వెళ్లకుండా చూడాలన్నారు. మున్నేరు ముంపు ప్రాంతాన్ని పర్యవేక్షించాలని, మున్నేరు ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలని అన్నారు. ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

Hospital

read also : తెలంగాణలోని 40 బీసీ కులాలను OBC జాబితాలో చేర్చండి..

ముంపుకు గురయ్యే ప్రాంతాలు, పీఆర్, ఆర్ అండ్ బి రోడ్లపై, కల్వర్టులపై నీరుప్రవహించే ప్రాంతాల్లో రవాణా నిషేధించి, రాత్రి పగలు సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. రోడ్లపై రవాణా నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోడ్లను సూచిస్తూ, 2 కి.మీ. ముందుగానే సూచికలు ప్రదర్శించాలని, ప్రవాహం కిరువైపుల ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి, సిబ్బందిని కాపలా పెట్టాలని ఆయన తెలిపారు. జిల్లాలోని 983 చెరువుల్లో 7 చెరువులు సర్ ప్లస్ ఉన్నట్లు ఆయన అన్నారు. అలుగుల వద్ద చేపలు పట్టకుండా నివారించాలని, ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్ల మూసివేతలపై సంబంధిత గ్రామాల్లో చాటింపు వేయించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

read also : rain alert : తెలంగాణ కు భారీ వర్ష సూచన .. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ..

గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఏ ఏ చెరువులు, కుంటలు ప్రమాదకరంగా మారతాయో అంచనా వేసుకొని, తదనుగుణంగా నష్ట నివారణగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఉరుములు, పిడుగులతో ప్రాణ నష్టం జరుగుతున్నట్లు, వీటి నివారణకు దామిని (damini) యాప్ పై డౌన్లోడ్ పై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. దామిని యాప్ తో పిడుగుల గురించి ముందస్తుగా తెలుసుకొనే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇరిగేషన్ ఎస్ఇ నర్సింగ రావు, డిఎస్ఇ ధన్ కుమార్ రెడ్డి, జెడ్పి సిఇఓ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.