Read News in Telugu Language
adsdaksha

స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 15

స్ట్రాంగ్ రూం ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) తెలిపారు. బుధవారం రిటర్నింగ్ అధికారి, ఖమ్మం ( khammam ) రూరల్ మండలం, పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూం లను సందర్శించి, భద్రతను పరిశీలించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం లను పరిశీలించి, విధుల్లో ఉన్న సాయుధ బలగాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

read also : ponguleti : మాట్లాడుకుందాం రండి…! నాలుగురోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ..

స్ట్రాంగ్ రూం ల వద్ద ఏర్పాటు చేసిన లైట్లు 24 గంటలు ఆన్ లో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూం సిసి కెమెరాల వ్యూ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఇడి తెరలను పరిశీలించి, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్ట్రాంగ్ రూం ల పరిశీలనకు ఎంట్రీ పాస్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లను అనుమతించాలని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ రూం ల ఏర్పాటు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అప్రమత్తంగా వుంటూ, భద్రతా చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారి అన్నారు.

Hospital

read also : వేసవి సెలవుల్లో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్..

సందర్శనలో శిక్షణ ఐపీఎస్ పి. మౌనిక, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డిసిపి ప్రసాదరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.