Read News in Telugu Language
adsdaksha

ధరణి పెండింగ్ దరఖాస్తులు నెలాఖరులోగా పరిష్కరించండి : జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 22

ధరణి పెండింగ్ దరఖాస్తులు నెలాఖరులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) అన్నారు.  రు. బుధవారం కలెక్టర్ కూసుమంచి తహశీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేశారు. మండలానికి సంబంధించి ధరణి పెండింగ్ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ స్లాట్ ల గురించి తహశీల్దార్ ని అడిగి తెలుసుకున్నారు.

Read also: ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపాలి : సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి..

ప్రభుత్వం ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టిందని, ప్రతి దరఖాస్తు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. కూసుమంచి మండలంలో టీఎం33, మ్యూటేషన్ తదితర అన్ని రకాల దరఖాస్తులను కలుపుకొని ధరణి లో 380 దరఖాస్తులు, 15 రిజిస్ట్రేషన్ స్లాట్ లు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.

Hospital

Read also: ప్రపంచంతో పోటీ పడేలా ఆరు నూతన పాలసీలు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…

పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం అతిముఖ్యoగా భావించి, నెలాఖరు లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కూసుమంచి లోని పిఏసీఎస్ కల్లూరిగూడెం సందర్శించి, ధాన్య కొనుగోలు గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ రైతులతో మాట్లాడారు. దాదాపు అందరు సన్నాలే పండించినట్లు, సన్నాలకు మంచి ధర వచ్చినట్లు రైతులు కలెక్టర్ కు తెలిపారు. లైసెన్స్ ట్రేడర్లు, మిల్లర్లు క్వింటాలుకి రూ. 2600 నుండి 2400 ఇచ్చి కొనుగోలు చేశారని రైతులు సంతోషంగా తెలిపారు. ధాన్య అమ్మకం విషయమై తమకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని రైతులు అన్నారు. ఎరువుల విషయమై రైతులను అడగగా, పెరికసింగారం లో ఎరువుల పాయింట్ ఉన్నట్లు రైతులు తెలిపారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, కూసుమంచి తహసీల్దార్ సురేష్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.