Read News in Telugu Language
adsdaksha

విక్రయ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగు పరచండి : అధికారులకు కలెక్టర్ ఆదేశాలు..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 30

జిల్లాలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వ్యవసాయ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వ్యవసాయ శాఖ అధికారులు, పిఏసీఎస్ సిఇఓ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విత్తన అమ్మకాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిఏసీఎస్ లకు కేటాయించిన విత్తనాలు విత్తన విక్రయ కేంద్రాల ద్వారా వెంట వెంటనే అమ్మకాలు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు కూపన్లు జారీ చేశాక విక్రయ ప్రక్రియ ఆపకూడదని, రైతులకు ఇబ్బందులు కల్గించవద్దని ఆయన అన్నారు.

Read also: కొండగట్టు జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు : దేవాదాయ కమీషనర్ హనుమంతరావు..

సరఫరా చేసిన విత్తనాలు అమ్మకం చేస్తే, తిరిగి ప్రభుత్వం నుండి విత్తనాల సరఫరా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. విత్తన విక్రయ కేంద్రాల్లో స్టాఫ్ పెంచాలని, అమ్మకం ఆలస్యం చేస్తే, క్యూ లైన్లు పెరిగి సమస్యలు వస్తాయని అన్నారు. కేంద్రాల వద్ద చల్లని త్రాగునీరు, నీడకు షామియాన, కుర్చీలు తదితర మౌళిక సదుపాయాలు కల్పన చేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు విత్తన విక్రయ కేంద్రాల వద్ద ఉండాలన్నారు.

Hospital

పచ్చిరొట్ట, పత్తి విత్తనాలకు జిల్లాలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అన్నారు. అన్ని రకాల విత్తనాలు సమాన దిగుబడులు ఇస్తాయని, వాతావరణం, నిర్వహణపై దిగుబడి ఆధారపడి ఉంటుందని, ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. విత్తనాలు సరసమైన ధరలకు, సకాలంలో అందించాలన్నారు. తనిఖీలు చేపడుతూ, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Read also: అదిరిపోయే ఫీచర్ లతో పోకో F6 5జీ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్..

గ్రామాల్లో లైసెన్స్ లేని, గుర్తుతెలియని వ్యక్తులు విత్తన అమ్మకాలు చేపట్టితే, వ్యవసాయ అధికారులు రిపోర్ట్ చేయాలని కలెక్టర్ తెలిపారు. రైతులకు అవగాహనకై విస్తృత ప్రచారం చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, శ్రీనివాస రెడ్డి, ఏవోలు రాజు, ఛాయా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.