Read News in Telugu Language
adsdaksha

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్దం.. స్ట్రాంగ్ రూం ఉదయం గం. 5కే ఓపెన్ : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం: జూన్ 2

లోక్ సభ సాధారణ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) తెలిపారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి రిటర్నింగ్ అధికారి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి, అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్నట్లు తెలిపారు.

ఖమ్మం లోక్ సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు 7 కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కొరకు ఒక హాల్, మొత్తం 8 కౌంటింగ్ హాళ్లు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో 18 టేబుళ్లు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి టేబుల్ కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని ఆయన తెలిపారు. ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షల 31 వేల 39 మంది ఓటర్లు ఉండగా, 12 లక్షల 41 వేల 135 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు. 10 వేల 687 పోస్టల్ బ్యాలెట్లు ఉండగా, ఆదివారం వరకు 430 ఇటిపిబిఎస్ ద్వారా ఓట్లు పోలయినట్లు కలెక్టర్ తెలిపారు.

read also : బీజేపీకి తెలంగాణలో స్థానం ఉండకూడదంటే బీఆర్‌ఎస్ బతకాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని..

Hospital

కనిష్టంగా అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 184 పోలింగ్ కేంద్రాలుండగా, కౌంటింగ్ ప్రక్రియ 13 రౌండ్లలో, గరిష్టంగా సత్తుపల్లి, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు 290, 294 పోలింగ్ కేంద్రాలు వున్నందున 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవనున్నట్లు కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వివిప్యాట్ ల కౌంటింగ్ ర్యాండంగా చేపట్టనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల మధ్య కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా కార్యాచరణ చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 600 మంది కౌంటింగ్ సిబ్బంది, 600 మంది సీలింగ్, సహాయక సిబ్బంది, 250 మంది పోలీసులు, మొత్తంగా 1500 మంది కౌంటింగ్ ప్రక్రియలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు 565 మంది కౌంటింగ్ ఏజెంట్లను ప్రతిపాదించినట్లు, వీరందరికి పాసులు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లిక్విడ్ పదార్థాలు కౌంటింగ్ హాల్లోకి అనుమతి లేదన్నారు. ఫలితాల వెల్లడి, సమాచారం వేగంగా చేరుటకు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎల్ఇడి లు ఏర్పాటుచేసి, ఫలితాలు ప్రదర్శించనున్నట్లు, అదేవిధంగా నగరంలోని క్రొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, వైరా బస్ స్టేషన్, సత్తుపల్లి బస్ స్టేషన్ వద్ద ఎల్ఇడి తెరలు ఏర్పాటు చేసి, ఫలితాలు ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

read also : తెలంగాణ ప్రజలకు దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

ఎన్నికల సంఘం ఎన్కోర్ సాఫ్ట్ వేర్ ద్వారా ఫలితాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో చూడవచ్చని కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అంబులెన్స్, ప్రత్యేక వైద్య శిబిరం, ఫైర్ సేవలు అందుబాటులో ఉంచామన్నారు. కౌంటింగ్ రోజున సిబ్బంది ఉదయం 5 గంటలకు, ఏజెంట్లు ఉదయం 6 గంటల వరకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని, స్ట్రాంగ్ రూమ్ లను ఉదయం 5 గంటలకు పరిశీలకులు, అభ్యర్థులు, ప్రతినిధుల సమక్షంలో తెరవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

సమావేశంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామన్నారు. ఏసీపీ, ప్రత్యేక బలగాలు కేటాయించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత వైరా, రూరల్, నగరంలో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి, గొడవలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరిస్తామన్నారు. స్టాఫ్, ఏజెంట్లు, మీడియా కు ప్రవేశాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. మీడియా ప్రవేశానికి ప్రత్యేక గేట్ ఏర్పాటు చేశామన్నారు. మీడియా వారికి ఎన్నికల సంఘం చే జారిచేయబడిన అథారిటీ లెటర్స్ ఉన్నవారికి ప్రవేశం వుంటుందన్నారు. ప్రవేశం వద్ద ప్రిస్కింగ్ చేపడతామని, తనిఖీల అనంతరం అనుమతి ఉంటుందని, ఫోన్లు క్లోక్ రూం లో ఉంచాలన్నారు. పోస్ట్ కౌంటింగ్ గొడవలు జరిగితే, సమాచారం ఇవ్వాలని సిపి కోరారు. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.