Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం కలెక్టర్ అధ్వర్యంలో సరిహద్దు రాష్ట్రాల అధికారుల సమావేశం..

దక్ష న్యూస్ , ఖమ్మం: నవంబర్ 6:

స్వేచ్ఛ యుత వాతావరణంలో న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహణకు సరిహద్దు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో సహకారం అందించాలని ఖమ్మం జిల్లా ( khammam district ) కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ( collector v.p. gautham ) అన్నారు. సోమవారం సత్తుపల్లి మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్‌.టి.ఆర్‌., ఏలూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లి ఎన్నికలకు ఈ నెల 3న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలయిందని, నామినేషన్లకు చివరి తేది ఈనెల 10 అని తెలిపారు. ఈ నెల 30 పోలింగ్‌ జరగనున్నట్లు వెల్లడించారు.

Read also : ముదిరాజ్ ల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ రావు..

ఎన్నికల్లో డబ్బు, మధ్యం ప్రలోభాలను నియంత్రించి ఓటర్లు స్వేచ్ఛగా న్యాయబద్దంగా తమ ఓటు హక్కును వినియోగించు కునేలా చర్యలు చేపడ్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని సత్తుపత్లి నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాలు ఎన్‌టిఆర్‌ జిల్లాతో సరిహద్దులు కలిగి ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉండడంతో సరిహద్దు రాష్ట్రంలో నిల్వలు వుంచి అక్కడి నుండి నగదు, మధ్యం తరలించే అవకాశాలు ఉన్నాయన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని వేర్‌హౌస్‌లు, గోడౌన్‌లు, ఫంక్షన్‌ హాల్లలో తణిఖీలు చేపట్టి నిల్వలపై చర్యలు చేపట్టాలన్నారు.

 

సరిహద్దు మండలాలపై గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ అన్నారు. అనుమానిత బ్యాంకు లావాదేవీలు, ఒక ఖాతా నుండి ఒకేరోజు పదికంటే ఎక్కువ ఖాతాలకు యుపిఐ ద్వారా నగదు బదిలీ, బల్క్‌ మొత్తంలో నగదుడ్రా పర్యవేక్షణ చేసి చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలకు సి విజిల్‌ యాప్‌పై అవగాహన కల్గించి విస్తృత ప్రచారం ద్వారా చైతన్యం తేవాలన్నారు.

Read also : తుమ్మ పొదలు కావాలా.. పువ్వాడ పూలు కావాలా నిర్ణయించుకోండి..

సమావేశంలో ఖమ్మం పోలీసు కమీషనర్‌ విష్ణు యస్‌. వారియర్‌ మాట్లాడుతూ, అంతర్‌రాష్ట్ర జిల్లాల సమన్వయం కొరకు, ఎన్నికలలో డబ్బు, మధ్యం నియంత్రణకు చర్యలకై సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాకు 266 కిలోమీటర్ల నిడివితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏలూరు, ఎన్‌టిఆర్‌ జిల్లాల సరిహద్దు ఉందన్నారు. 12 మేజర్‌ రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు 24 గంటలు నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. సరిహద్దు రాష్ట్ర జిల్లాల అధికారులు అవసరం దృష్ట్యా ఎక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలో చేసి 24 గంటల నిఘా ఉంచాలన్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు సరిహద్దు గ్రామాల్లో పెట్రోలింగ్‌ చేపట్టాలని, అనుమానిత చర్యలు సోషల్‌ మీడియాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులు ఒకరినొకరు తమ కాంటాక్ట్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు.

 

Hospital

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆల మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆoధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏలూరు, ఏఎస్‌ఆర్‌, చత్తిస్‌ఘడ్‌లోని సుఖుమా జిల్లాల సరిహద్దులు ఉన్నాయన్నారు. మద్యం రవాణాపై గట్టి నిఘా పెట్టాలన్నారు. అక్రమ మధ్యం చాలా తక్కువ సీజ్‌ అవుతున్నట్లు దీనిపై గట్టి నిఘా పెట్టాలన్నారు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్‌ మాట్లాడుతూ, చెక్‌పోస్టులలో తణిఖీల డాటా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తనిఖీలు సీరియస్‌గా చేపట్టాలన్నారు.

అనంతరం  ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు మాట్లాడుతూ, సరిహద్దు జిల్లాల సహకారానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఎస్‌టిలు ఏర్పాటు చేసి వాటికి తగినంత సిబ్బందిని నియమించి, ఏ రోజు సీజింగ్‌ వివరాలు ఆరోజు సమాచారం ఇస్తామన్నారు. యూపిఐ లావాదేవీలు, బ్యాంక్‌ లావాదేవిలు పర్యవేక్షణ చేస్తామన్నారు. సమస్యాత్మక రహదారులపై టిమ్‌లను ఏర్పాటు చేస్తామని, బాద్యతాయుతంగా నిబద్దతతో విధులు చేపట్టి సహకరిస్తామని అన్నారు.

Read also :సొంత పార్టీలకు జెలక్ ఇస్తున్నట్లు చేస్తున్న సరదా రాయుళ్లు ..

ఎన్‌టిఆర్‌ జిల్లా డిసిపి అజిత మాట్లాడుతూ, జిల్లాలో 12 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసామన్నారు. తెలంగాణాతో ఉన్న 239 కి.మి సరిహద్దులో 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 8 వందలకు పైగా వ్యక్తులను బైండోవర్‌ చేశామన్నారు. అంతర్‌ జిల్లాల అధికారులతో 20 కి పైగా సమావేశాలు నిర్వహించి అక్రమ మద్యం అదుపుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏలూరు జాయింట్‌ కలెక్టర్‌ బి. లావణ్య వేణి మాట్లాడుతూ, తెలంగాణతో ఏలూరు జిల్లాకు 11 సరిహద్దు గ్రామాలు ఉన్నాయన్నారు. 7 చెక్‌పోస్టులు పెట్టి 24 గంటల నిఘా చేపట్టామన్నారు. మద్యం, అనుమానిత నగదు లావాదేవిలపై నిఘా పెడతామన్నారు. ఏరోజుకు ఆరోజు నివేదికలు అందజేస్తామన్నారు.

ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌ డి. మదుసూదన్‌ నాయక్‌, శిక్షణ సహాయ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, అడిషనల్‌ డిసిపి ప్రసాదరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఎన్‌టిఆర్‌, ఏలూరు జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌, బ్యాంకింగ్‌, కోఆపరేటివ్‌, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.