Read News in Telugu Language
adsdaksha

నేటి సాయంత్రం నుండే గృహ లక్ష్మి దరఖాస్తులు అందుబాటులోకి..

దక్ష న్యూస్, ఖమ్మం : డిసెంబర్ 27

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నఆరు గ్యారంటీల అమలు పథకం దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తులు నేటి సాయంత్రం (బుధవారం) ప్రజలకు అందుతాయని ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) ఒక ప్రకటనలో తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ఒకే ఫారం లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన అన్నారు.

Hospital

read also : తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి

గురువారం నుండి ప్రారంభం అయ్యే ప్రజా పాలన ( prajapalana ) కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ/వార్డు సభలు ఉ. 8.00 గంటల నుండి మ. 12.00 గంటలు, తిరిగి మ. 12.00 గంటల నుండి సా. 6.00 గంటల వరకు జనవరి 6 వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామ/వార్డు సభల నిర్వహణ విషయమై ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇస్తామని, దరఖాస్తులు పూరించి, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో గ్రామ/వార్డు సభలలో సమర్పణకు ప్రజలు సిద్దంగా వుండాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.