Read News in Telugu Language
adsdaksha

ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు.. మధిర గ్రామ సభలో కలెక్టర్ వి.పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం: డిసెంబర్ 30

ప్రజల వద్దకే పాలనను తేవాలని సదుద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( collector v.p. gautham ) అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో చేపడుతున్న సభలలో అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శనివారం మధిర ( madhira ) పట్టణంలోని 6వ వార్డు మడుపల్లి గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, ప్రజలకు ప్రజాపాలన ( prajapalana ) కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 217 గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ప్రజాపాలన సభలు నిర్వహించి, 60 వేలకు పైగా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

read also : ATA : ఆటా ఆధ్వర్యంలో భారీ సేవ కార్యక్రమాలు..

అర్హులైన లబ్దిదారులు ప్రజా పాలన సభలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. దరఖాస్తు దారులు ముందస్తుగానే తమ దరఖాస్తును నింపి దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లలో అందించాలన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6, 2024 వరకు పని దినాలలో ప్రతి రోజు ఉదయం 8 గం॥ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు, మధ్యాహ్నం 2 గం॥ల నుండి సాయంత్రం 6 గం॥ల వరకు ప్రజాపాలన సభలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు ఫారముతో పాటు ఆధార్‌, రేషన్‌ కార్డుల జిరాక్స్ ప్రతులు జతపరచాలని, దరఖాస్తుదారునికి తప్పనిసరిగా రశీదు అందించడం జరుగుతుందని తెలిపారు.

Hospital

read also : ఆదాయం కమ్యూనిటీ సర్టిఫికెట్ లు అవసరం లేదు..

దరఖాస్తు దారులు తమ రశీదును జాగ్రత్తగా భద్రపరుకోవాలని కలెక్టర్ అన్నారు. ఆధార్ లో సవరణల అవసరం లేదని, తమ వద్ద ఉన్న ఆధార్ జిరాక్స్ మాత్రమే జతపర్చాలన్నారు. కుటుంబానికి ఒక దరఖాస్తు చాలని, కుటుంబ సభ్యులు ఏ పథక లబ్ది కావాలనుకుంటుంన్నారో అది పూరించాలని ఆయన తెలిపారు. పెన్షన్ వస్తున్న వారు మళ్ళీ నింపడానికి అవసరం లేదని, ప్రభుత్వం పెన్షన్ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా మీకు లబ్ది చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. అర్హత ఉండి, పెన్షన్ రానివారు, చేయూత పథకం క్రింద అప్లై చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇంటి స్థలం ఉన్న, లేని వారు ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేయాలని తెలిపారు.

రైతు భరోసాలో సాదాబైనామా లో భూమి ఉన్నవారు సర్వే నెంబర్, రెవిన్యూ శివారు, విస్తీర్ణం పొందుపర్చాలన్నారు. ప్రజాపాలన సభల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో సందేహాలు నివృత్తి కొరకు సహాయం పొందాలన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, మునిసిపల్ కమీషనర్ రమాదేవి, వార్డ్ కౌన్సిలర్ వరలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.