Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ మూడో జాబితా వచ్చేసింది .. కామారెడ్డి బరిలో రేవంత్‌రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 6

సత్తుపల్లి మట్టా రాగమయి.. ఇద్దరు అభ్యర్థులు రీప్లేస్‌మెంట్ ..

సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ టికెట్లపై వీడని సస్పెన్షన్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 16 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేయగా, అందులో ఇద్దరు అభ్యర్థులను రీప్లేస్ చేసింది. మరో ఐదు రోజుల్లో నామినేషన్లు ముగియనున్న నేపథ్యంతో మూడో జాబితా విడుదలయ్యింది. సీపీఎం పార్టీ పొత్తుల నేపథ్యంలో మరికొన్ని స్థానాలను కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టింది. కాగా తొలిజాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లు, రెండో జాబితాలో 45 మంది, తాజాగా 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన 16 స్థానాల్లో బోథ్, వనపర్తి స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. బోథ్‌లో ఆడే గజేందర్, వనపర్తిలో తూడి మేఘారెడ్డికి టికెట్ కట్టబెట్టారు. ఇకపోతే సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదిలావుంటే.. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండగా, పటాన్‌చెరు నుంచి మొదటి నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్‌ పేరు విన్పిస్తున్నా.. చివరకు నీలం మధుముదిరాజ్‌కు టికెట్ కేటాయించారు.

Hospital

read also : కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొడిసేసింది.. కొత్తగూడెంతో పాటు రెండు ఎమ్మెల్సీలు ..

సత్తుపల్లిలో మట్టా రాగమయికి టికెట్ ఖరారు చేశారు. వైరా లోను విజయాబాయికి బదులు రాందాస్ మాలోత్ కి టికెట్ కేటాయించారు.

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా ఇదే..

చెన్నూరు- వివేకానంద్, బోథ్ – ఆడే గజేందర్‌, జుక్కల్-తోట లక్ష్మీకాంతా రావు, బాన్సువాడ-ఏనుగు రవీందర్‌ రెడ్డి, కామారెడ్డి- రేవంత్ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్- మహ్మద్ షబ్బీర్ అలీ, కరీంనగర్‌-పురుమల్ల శ్రీనివాస్, సిరిసిల్ల- కొందం కరుణ మహేందర్ రెడ్డి, నారాయణఖేడ్- సురేశ్ కుమార్‌ షెట్కార్, పటాన్‌చెరు-నీలం మధు ముదిరాజ్, వనపర్తి- తుడి మేఘారెడ్డి, డోర్నకల్‌-జాటోత్ రామచంద్రు నాయక్, ఇల్లందు-కోరం కనకయ్య, వైరా-రాందాస్ మాలోత్, సత్తుపల్లి-మట్టా రాగమయి, అశ్వారావు పేట- జారె ఆదినారాయణ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.