Read News in Telugu Language
adsdaksha

ఆరు గ్యారంటీలతో పాటు 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 17

ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేరిట శుక్రవారం రిలీజ్ అయింది
. రూ.500లకే గ్యాస్, సన్న బియ్యం, మహిళలకు నెలకు రూ.2500,
రైతు భరోసా రూ.15వేలు, కూలీలకు రూ.1200లు
పెన్షన్లు రూ.4వేలకు పెంపు, ఇండ్లకు రూ.5లక్షల సహాయం
, ఆడవారికి బస్సు ఫ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్
వంటి వాటితో ఆరు గ్యారెంటీలు సహా 37 అంశాలు చేర్చిన హస్తం పార్టీమ్యానిఫెస్టో ఇప్పడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో ఒక్కోపార్టీ తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేయగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టో విడుదల చేసింది. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శుక్రవారం నాడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. అభయహస్తం పేరిట రిలీజ్ చేసిన మేనిఫెస్టో లో ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు 37 అంశాలను అందులో చేర్చారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవభృతి అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

read also : మార్పురావాలంటే హస్తం గుర్తు పై ఓటేయ్యాలి .. దొరల రాజ్యంకు ఫుల్​స్టాప్​ పెట్టాలి..

Hospital

వీటితో పాటు వివిధ ఇతర అంశాలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం… రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వనుంది. అలాగే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. అదేవిధంగా మహిళలకు నెలకు రూ.2,500, వ్యవసాయ కార్మికులకు రూ.1200, రైతు భరోసా కింద రూ.15 వేలు సహాయం ఇస్తామన్నారు. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనే వారి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం, వృద్ధులకు చేయాత పథకంలో రూ. 4వేలు ఇస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది.

మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఇల్లులేని పేదవారికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించనున్నది. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణం. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1వరకు 4 నెలల జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. చేయూత పథకం కింద రూ.4వేల పింఛను అందజేయనుంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల బీమా కల్పించనుంది.

read also : కూనవరంలో పుట్టిన మంత్రి నేను లోకల్ అంటుంన్నారు..

అంగన్ వాడీలకు వేతనం రూ.18 వేలకు పెంపు , కొత్తగా మూడు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేల గౌరవ వేతనం, కల్యాణ లక్ష్మీ కింద ఆడపిల్ల పెండ్లికి రూ.లక్ష, తులం బంగారం, రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ, డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతోపాటు కమీషన్, ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను అబ్డేట్ చేయనుంది. ప్రతి రైతుకూ భూధార్ కార్డు తీసుకురానుంది. అలాగే రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.