Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ లో అదిరిపోయే హామీలు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 10

బీసీ సంక్షేమానికి రూ. లక్ష కోట్లు .. 42 శాతానికి రిజర్వేషన్ల పెంపు ..

‘వృత్తి బజార్’ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్..

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు ఓటర్ల పై హామీల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం కామారెడ్డి ( kamareddy ) లో తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. ఈ సందర్భంగా బీసీ (bc) లకు కాంగ్రెస్ ( congress ) హామీల వర్షం కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో హస్తం పార్టీ ముందుగానే చెబుతోంది.

ఈ సారి కాంగ్రెస్ యువత.. ఉద్యోగులు.. మహిళలు.. రైతులే టార్గెట్ గా మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో తుక్కుగూడ సభతో కొత్త జోష్ వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6గ్యారెంటీలు ఇచ్చింది. వీటి గురించి వివరిస్తూ ఆ పార్టీ అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు జనాల్లోకి వెళ్తున్నారు. సభలో సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌తో జనాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదీవరకు మైనార్టీ, దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించిన హస్తం తాజాగా బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చింది.

Hospital

read also : కదం తొక్కిన యువం సైన్యం..

తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల కాల వ్యవధిలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన పద్మశాలీలకు పెన్షన్ తో పాటు విశ్వకర్మల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని తెలిపింది. బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని పేర్కొంది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల కుల గణన చేసి, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల పెంపు చేస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది.

read also :ఏయే శివలింగాల్ని ఎలాంటి పూజా ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం కలుగుతుంది..

ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఓ బీసీ గురుకులంతో పాటు ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ లను బీసీ -ఏలో చేరుస్తామని హామీ ఇచ్చింది. ‘వృత్తి బజార్’ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.