Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ ఎనిమిదో జాబితా విడుదల ..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 28

కాంగ్రెస్ పార్టీ ఎనిమిదో జాబితా విడుదల చేసింది.
ఆదిలాబాద్ – సుగుణ కుమారి, నిజామాబాద్ – జీవన్ రెడ్డి
మెదక్ – నీలం మధు, భువనగిరిలో చామల కిరణ్ లా కుమార్ కు ఛాన్స్ ఇచ్చింది.

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ అధిష్టానం ఎనిమిదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.

Hospital

ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేశారు. అనంతరం 14 మంది అభ్యర్థల పేర్లను ప్రకటించారు. అందులో తెలంగాణలోని నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్ లో నాలుగు స్థానాలు, ఝార్ఖండ్, మద్యప్రదేశ్ లో చెరో మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

Read also: కోర్టుల్లో మౌలిక సౌకర్యాల కొరత : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్..

తెలంగాణ నుంచి ఆదిలాబాద్ (ఎస్టీ) బరిలో డాక్టర్ సుగుణ కుమారి చెలిమల, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ నలుగురితో కలుపుకున్ని ఇప్పటి వరకు తెలంగాణకు సంబందించి 13 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు సైతం త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.