Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్.. 43 మంది అభ్యర్థుల ప్రకటన ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : మార్చి 12

లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం ఏఐసీసీ ( aicc ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అయితే ఈ రెండో జాబితాలో ఏపీ ( ap ), తెలంగాణ ( telangana ) రాష్ట్రాల అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. రెండో జాబితాలో ఓబీసీలకు 13 సీట్లు, ఎస్సీలు 10 మంది, జనరల్ కేటగిరీ అభ్యర్థులు 10 మంది, ఎస్టీలు 9 మంది, ఒక ముస్లిం అభ్యర్థికి టికెట్లు కేటాయించారు.

Hospital

read also : యాదాద్రి ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..

ఇకపోతే అస్సాం నుంచి 12 మంది, గుజరాత్ నుంచి ఏడుగురు, మధ్యప్రదేశ్ నుంచి 10 మంది, రాజస్థాన్ 10 మంది, ఉత్తరఖండ్ నుంచి ముగ్గురు, డయ్యూ అండ్ డామన్ నుంచి ఒక్కరికి అవకాశం కల్పించారు. అయితే ఈ జాబితాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కొడుకు నకుల్‌నాథ్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్ గెహ్లాట్‌కు టికెట్లు కేటాయించింది. తెలంగాణ నుంచి ఇప్పటికే నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా, త్వరలోనే రానున్న మూడో జాబితాలో తెలంగాణకు సంబంధించి మిగిలిన అభ్యర్థుల పేర్లు ఖరారు కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.