Read News in Telugu Language
adsdaksha

పొంగులేటికి కాంగ్రెస్ అధిష్టానం జన్మదిన కానుక..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 28

పాలేరు అభ్యర్థిగా పొంగులేటి పేరును ప్రకటించిన ఏఐసిసి..

ఖమ్మానికి తుమ్మల .. పినపాకకు పాయం ..

సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..

కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతతో ఎదురు చూసిన తెలంగాణ ( telangana ) కాంగ్రెస్ అభ్యర్ధుల రెండో లిస్ట్ శుక్రవారం రిలీజ్ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ ( congress ) సెకండ్ లిస్ట్ లో 45 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. హుజురాబాద్ నుంచి వడితల ప్రణవ్, సిద్ధిపేట నుంచి పూజల హరికృష్ణ, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డి, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ, జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. అదీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినానికి ఒక రోజు ముందే సెకెండ్ లిస్ట్ బయటికి రావడంతో పొంగులేటి జన్మదిన కానుకగా అభివర్ణిస్తూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటుంన్నారు.

అయితే కాంగ్రెస్ రెండో జాబీతాలో సెకండ్ లిస్ట్ లో ఖమ్మం ( khammam ) జిల్లాకి మూడు సీట్లు మాత్రమే ఖరారయ్యాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం మొత్తం ఐదు సీట్లు ప్రకటించింది. మరో ఐదు నియోజకవర్గాలలో‌ సీటు ఎవరికి వస్తుందో అంటూ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Hospital

read also : అన్నకు తగ్గ తమ్ముడు.. ప్రచారంలో దూసుకుపోతున్న పొంగులేటి సోదరులు..

ప్రచారంలో దూసుకుపోతున్న పొంగులేటి కుంటుంబం..

మొదటి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు సీటు ఇవ్వడానికి అధిష్టానం సుముఖంగా ఉండడంతో శ్రీనివాసరెడ్డి అదే నియోజకవర్గంపై సీరియస్ గా దృష్టి సారించారు. ఖమ్మం నియోజక వర్గంతో పాటూ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలుపుకోసం ప్రచారం చేసిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో ఆయనను పాలేరులో గెలిపించేందుకు కంకణం కట్టుకున్న ఆయన కుటుంబ సభ్యులు పొంగులేటి ప్రసాదరెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా ఇప్పడు నామినేషన్ ల సమయం దగ్గరపడుతుండడంతో ఎప్పుడూ బైటికి రాని శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి, ప్రసాదరెడ్డి సతీమణి శ్రీలక్ష్మి, కుమారుడు హర్షారెడ్డి పాలేరు నలుదిక్కులలో ప్రచారానికి తెరలేపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించాని విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. దాంతో పొంగులేటి అభిమానులతో పాటూ, ఇతరులు శ్రీనివాసరెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటూ అభిమానాన్ని చాటుకుంటుంన్నారు.

సకుటుంబ సపరివార సమేతంగా..

కాంగ్రెస్ అధిష్టానం పొంగులేటి పేరును రెండో జాబితాలో అధికారికంగా ప్రకటించడంతో శుక్రవారం శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ ఎన్నికల ప్రచారం లో స్పీడ్ పెంచింది… ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రచారంలో జోరు పెంచింది. ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టించేందుకు ఒకే రోజు పొంగులేటి కుటుంబంలోని నలుగురు ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఖమ్మం రూరల్ మండలంలోని గణేష్ టౌన్ షిప్ లో పొంగులేటి సతీమణి మాధురి … నేలకొండపల్లి మండలం చెన్నారం, అమ్మగూడెంలో తమ్ముడు ప్రసాద్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, కరుణగిరిలో ప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీ లక్ష్మి…. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్ష రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకూ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లను వివరిస్తూ ముందుకు సాగారు. అవినీతి బీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని కోరారు. హస్తానికి ఓటు వేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం సాధ్యమని ప్రజలకు వివరించారు. ఇంటింటీ ప్రచారానికి వెళ్లిన పొంగులేటి కుటుంబ సభ్యులకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తామని హామీ ఇచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.