Read News in Telugu Language
adsdaksha

Covid jn -1 : కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 పై సీఎం వై.యస్‌. జగన్‌ సమీక్ష..

దక్ష న్యూస్, విజయవాడ: డిసెంబర్ 22

కోవిడ్ జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు వెల్లడించినట్లు ఏపీ సీఎం వై.ఎస్. జగన్ తెలిపారు. ఈ వేరియంట్‌ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారని అయినా
ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలని సూచించారు.

అత్యంత బలంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్‌ చేయాలన్నారు.
కొత్తవేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Read also: Free Tea : లారీ డ్రైవర్లకు ఫ్రీ ఛాయ్‌.. ఒడిశా ప్రభుత్వం వినూత్న నిర్ణయం..

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఈ సందర్బంగా అధికారులు వైరస్ లో
డెల్టా వేరియంట్‌ తరహా లక్షణాలు లేవని తేల్చి చెప్పారు. అయితే జేఎన్‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు.

Hospital

Read also: దివ్యాంగులను కించపరిచే పదాలు వాడొద్దు..ఈసీఐ..

పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్‌ ల్యాబ్‌లో పరిశీలిస్తున్నామని వైద్యాధికారులు సీ ఎం జగన్ కి తెలిపారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని అన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ పెడుతున్నామన్న అధికారులు
ఆస్పత్రుల్లో పర్సనల్‌ కేర్‌ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామని వివరించారు. పీఎస్‌ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామని,
అలాగే ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు, డి–టైప్‌ సిలిండర్లు కూడా సిద్ధంచేశామని చెప్పారు.
56,741 ఆక్సిజన్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.