Read News in Telugu Language
adsdaksha

సీఎం గా చేశావా.. చప్రాసీ నౌకరీనా.. కేసీఆర్ పై సీపీఐ నారాయణ ఫైర్..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 15

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు సీఎంగా చేశావా లేక చప్రాసీ నౌకరీ చేశావా అని సీపీఐ  ( cpi ) జాతీయ కార్యదర్శి నారాయణ ( narayana ) మండిపడ్డారు. కేసీఆర్ ( kcr ) అహంభావం, అవినీతి వల్లే ఉద్యమ పార్టీకి సైతం ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ ( medigadda ) పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోయినయా అంటారా అని ఫైర్ అయ్యారు.

Read also: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం .. వెంటనే ఆపేయాలని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశం ..

అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాశ్వతంగా రాబోమని బైకాట్ చేయడమేంటని నారాయణ ప్రశ్నించారు. ప్రజా సంపాదనను పందికొక్కులా తింటూ అసెంబ్లీకి పోవడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ అసెంబ్లీ నుంచి గెంటేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పారు.

Hospital

Read also : అవయవ దాతలకు గౌరవంగా అంత్య క్రియలు .. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం ..

తెలంగాణ బీజేపీ తెలివి చూపిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐకీ అప్పగించాలని కోరుతుందని తెలిపారు. సీబీఐకి కేసు అప్పగించి మేనేజ్ చేయాలని అనుకుంటుందని, తెలంగాణ బీజేపీ కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తుందని నారాయణ పేర్కొన్నారు.

Read also: ఉద్యోగాలు ఇచ్చే చాతకాలే.. మేం 25 వేల నౌకర్లు ఇచ్చాం: సీఎం రేవంత్ ..

రూ.వేల కోట్ల అవినీతికి కేసీఆర్ బాధ్యుడని, కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి ఇస్తే అభివృద్ది చేస్తామని హరీశ్ రావు అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ తపన పడుతుందని, ఆ పార్టీ నేతలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. 2 నెలలు కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట అన్నారు.

Leave A Reply

Your email address will not be published.