Read News in Telugu Language
adsdaksha

26న పబ్లిక్ గార్డెన్స్‌ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 17

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (cs shanthikumari ) అధికారులను ఆదేశించారు. బుధవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ ( telangana ) రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్‌ లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

read also : ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాం ..

Hospital

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌ లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సీఎస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. రాజ్‌భవన్‌, సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర అన్ని ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆర్‌ అండ్‌ బి శాఖను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ ను ఏర్పాటు చేయాలని, తగిన పరిమాణంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖకు సూచించారు.

read also : వందేభారత్ ప్రోమో రిలీజ్.. ఇదేం గొడవ భయ్యా.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట వేళ..

పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ, ఆహ్వానితులందరికీ తాగునీటి సరఫరా చేపట్టాలని మున్సిపల్ శాఖను సీఎస్ శాంతి కుమారి కోరారు. ఇతర సంబంధిత శాఖలు తగిన విధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. డీజీపీ రవిగుప్తా, పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌రావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, పోలీస్, డిఫెన్స్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.