Read News in Telugu Language
adsdaksha

12 మంది ఐపీఎస్ ల బదిలీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 12

రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు అయ్యాయి. తాజాగా 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ( cs shanthikumari ) సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ సీపీగా తరుణ్ జోషి, రామగుండం కమిషనర్ గా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా జోయల్ డేవిస్, సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్, ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ, మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్ బాబు ట్రాన్స్ ఫర్ అయ్యారు.

read also : ఒకేసారి లక్షమందికి అపాయింట్మెంట్స్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోడీ..

Hospital

పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ ను బదిలీ చేసిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐఏఎస్ ఇంటి వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా మురళీధర్ ను నియమించారు. మరోవైపు రాష్ట్రంలో ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్ 1లో 64 మంది, మల్టీజోన్ 2లో 85 మంది ఎక్సైజ్ సీఐలకు స్థానచలనం కల్పించింది.

read also : హైదరాబాద్ ఎంపీ సీటు మాదే.. ఎంఐఎంను ఖతం చేస్తం : కిషన్ రెడ్డి..

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆబ్కారీశాఖనూ బదిలీల జాబితాలో చేర్చారు. దీంతో గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడేళ్లుగా ఒకే రెవెన్యూ జిల్లాలో పనిచేస్తున్న వారి విషయంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 105 మంది జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలను బదిలీ చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల టైంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు.

Leave A Reply

Your email address will not be published.