Read News in Telugu Language
adsdaksha

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం :మణుగూరు సిఐ రమాకాంత్ ..

దక్ష న్యూస్, మణుగూరు: అక్టోబర్ 4

దైనందిన జీవితంలో నిత్యం టెక్నాలజీ ( tecnology ) పై ఆధారపడుతున్న ఈ కాలంలో సైబర్ నేరాల ( cyber crime ) పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని మణుగూరు ( manuguru ) సర్కిల్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ ( si ramakanth ) అన్నారు. గురువారం మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ( nss )  ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన “సైబర్ నేరాలు మరియు ర్యాగింగ్ నిరోధక” అవగాహన కార్యక్రమంలో సిఐ రమాకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అనేక సందర్భాలలో మానవునిలోని ఆశలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారని అన్నారు. కనుక వాటి పట్ల విద్యార్థులు అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా ఉంటేనే సెల్ఫోన్ వినియోగం, ఆధునిక టెక్నాలజీ వినియోగంలో విజయవంతం అవుతారని లేకపోతే తీవ్ర నష్ట పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ వద్దకు వచ్చిన అనేక కేసులను వివరిస్తూ వాటి ద్వారా విద్యార్థులను చైతన్యవంతం చేశారు.

read also : 4 నుండి బతుకమ్మ చీరల పంపిణీ..

Hospital

మనం జాగ్రత్తగా ఉండడం ద్వారానే నేరాలు జరగకుండా నిరోదించవచ్చని సిఐ రమాకాంత్ తెలిపారు. అదేవిధంగా ర్యాగింగ్ పట్ల నిషేధం ఉందని, విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పరిచయ కార్యక్రమాల కోసం గానీ ఇతర ఏరకంగా గాని ఇబ్బందులకు గురి చేస్తే వారిని అనేక సెక్షన్ల ద్వారా తీవ్రంగా శిక్షించడం జరుగుతుందని సెక్షన్లను, శిక్షలను వివరించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న తాసిల్దార్ రాఘవరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగస్వాములు అవ్వాలని కోరారు.

read also : పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పారా సాయి ఉదయ్ కిరణ్ ..

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో తెలివైన వ్యక్తులు సైతం సైబర్ నేరగాళ్ల చేతిలో బలవుతున్నారని అటువంటివి జరక్కుండా ఉండడానికి అవసరమైన అనేక రకాల మెలుకువలు అవసరమని అన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలకు గురవుతారని అటువంటి ఆకర్షణలకు లోను కావద్దని విద్యార్థులను హెచ్చరించారు. మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ర్యాగింగ్ నిషేధం కొరకు అనేక చర్యలు తీసుకోవడంలో భాగంగానే మణుగూరు పోలీస్ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే సైబర్ క్రైమ్, ర్యాగింగ్ నిరోధక చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ చైర్మన్గా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.