Read News in Telugu Language
adsdaksha

కోర్టుల్లో మౌలిక సౌకర్యాల కొరత : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 27

-రాజేంద్రనగర్ లో నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన

కింది కోర్టుల్లోనే కాదు, పైకోర్టుల్లో కూడా మౌలిక సౌకర్యాల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు నిర్మాణానికి డీవై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ…. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందించారు.

Read also: కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే ..మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య ..

Hospital

నూతన హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని సీజే అన్నారు. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలన్నారు. బ్రిటిష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నట్లు చెప్పారు. యువత వేగంగా మార్పులను కోరుకుంటోందన్నారు. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలని సూచించారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలన్నారు. ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.

Read also : తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత ..14రోజుల రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు ..

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి. ఎస్.నర్సింహా, జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాదే, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంగా రాజకీయ నేతలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్ లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారు

Leave A Reply

Your email address will not be published.