Read News in Telugu Language
adsdaksha

నా పదవికి రాజీనామా చేస్తా .. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 2

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ముఖ్యమంత్రి సంకల్పానికి నిదర్శనమని వెల్లడి..

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణా ( telangana ) ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ( dabul bed room ) ఇండ్లను నిర్మించిందని, అవసరమైతే మరో లక్ష ఇండ్లను కూడా నిర్మించేందుకు సిద్దంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) వెల్లడించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు ( patanchervu ) నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు ( kolluru ) లో పటాన్ చెర్వు, గోషామహల్, ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్, కూకట్ పల్లి నియోజకవర్గాలకు చెందిన 6067 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో మొక్కను నాటారు. అనంతరం ఇండ్ల కేటాయింపు కోసం ర్యాండో మైజేషన్ పద్దతి ( randomization system ) లో ఆన్ లైన్ డ్రా ( online dra ) ను మంత్రి నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ లబ్దిదారుడిపై ఒక్క పైసా భారం పడకుండా అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేద, మద్య తరగతి ప్రజలకు అందిస్తున్న చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికే దక్కుతుందని అన్నారు. దేశంలో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్నట్లు నిరూపిస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని చాలెంజ్ చేశారు.

Hospital

read also : గ్రామ స్వరాజ్య కాంక్షకు అనుగుణంగా సీఎం కేసిఆర్ పాలన…

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల నుండి పురుడు పోసుకుందే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం అని మంత్రి చెప్పారు. నగరం పరిధిలోని పేదల కోసమే 9600 కోట్ల రూపాయల వ్యయంతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అందులో ఇప్పటి వరకు మొదటి విడతలో 11,700, రెండో విడతలో 13,200 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేయగా, మూడో విడత లో 36,884 లబ్దిదారులను ఎంపిక చేయగా, వీరిలో 2 వ తేదీన 19,020 మందికి, మిగిలిన వారికి 5 వ తేదీన ఇండ్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇంత పెద్ద సంఖ్యలో ఇండ్లను నిర్మిస్తే కొన్ని పార్టీల నాయకులు ఎక్కడ నిర్మించారు, ఎప్పుడు ఇస్తారని మాట్లాడారని, ఇప్పుడు వారి నోళ్ళు మూతపడ్డాయని అన్నారు.

ఎక్కడా రాజకీయ ప్రమేయం లేకుండా, పార్టీలకు అతీతంగా ఎంతో పారదర్శకంగా అర్హులైన వారికి ఇండ్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తలసాని వివరించారు. కోట్లాది రూపాయల విలువైన భూములలో సైతం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చిందని, ఇది పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి గట్టి సంకల్పానికి నిదర్శనంగా అభివర్ణించారు. అద్దె ఇంటిలో ఉంటున్న ప్రతి ఒక్క పేద కుటుంబం సొంత ఇంటి కల నెరవేర్చే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

read also : అహింసా సిద్దాంతాన్ని చాటి చెప్పిన మహనీయులు మహాత్మాగాంధీ ..

మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందుకున్న పలువురు లబ్దిదారులు తమ సొంత ఇంటి కల నేరవేరడంతో ఉద్వేగానికి లోనయ్యారు. మా పాలిట దేవుడు కేసిఆర్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, ఫైనాన్స్ కమీషన చైర్మన్ భూపాల్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ శరత్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, కార్పొరేటర్ లు పుష్పా నాగేష్, సిందు ఆదర్శ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.